Healthy Diet : రాత్రి తిన్న తర్వాత తరచూ ఆకలేస్తోందా.. ఇలా అనిపిస్తే ఏం చేయాలి..
ABN, Publish Date - Mar 09 , 2025 | 05:39 PM
Hungry at Late Nights : రాత్రి భోజనం కడుపు నిండా తిన్న తర్వాతా మీకు తరచు ఆకలిగా అనిపిస్తోందా.. అందుకని ఇంట్లో ఏదుంటే ఇది తినేస్తున్నారా.. ఇలాంటి అలవాటు మంచిదేనా.. ఒకవేళ మీరు తినాలనే కోరికను ఆపులేకపోతుంటే గనక ఇలా చేయండి..
Hungry at Late Nights : చాలామందికి డిన్నర్ పూర్తిచేసినా హఠాత్తుగా ఏ అర్థరాత్రి సమయంలోనో విపరీతమైన ఆకలి వేస్తుంటుంది. ఈ బాధ భరించలేక ఇంట్లో నిల్వ ఉంచిన చక్కెరలు కలిసిన పదార్థాలు, , ప్రిజర్వేటివ్‌లు, కేలరీలు అధికంగా ఉన్న అనారోగ్యకరమైన ప్యాక్డ్ ఫుడ్ తెగ తినేస్తుంటారు. నిజానికి అర్థరాత్రి సమయంలో తినాలనే కోరిక కలగడమే అంత మంచిది కాదు. రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొవడం వల్లే ఇలాంటి భావన పుడుతుంది అంటున్నారు నిపుణులు. ఈ అలవాటును మీరు నియంత్రించుకోలేకపోతుంటే కనీసం ఈ కింది ఆరోగ్యకరమైన ఆహారాలైనా ఎంపిక చేసుకోండి. కేలరీలు ఎక్కువగా లేని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి. ఈ కింది ఆహారాలు మీ ఆకలిని తీరుస్తాయి. అదేవిధంగా కేలరీలను పెంచవు.
రాత్రిపూట తినదగ్గ కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ :
బెర్రీలతో గ్రీకు పెరుగు
గ్రీకు పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. బెర్రీలు జోడించడం వల్ల చక్కెర వేయాల్సిన పనుండదు. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కొంచెం గ్రీకు పెరుగును తీసి దానిపై తాజా లేదా ఫ్రీజ్డ్ బెర్రీలు వేయండి.
నట్ బటర్ అండ్ ఆపిల్
ఆపిల్స్ ఫైబర్ గల సహజ తీపి పదార్థం. ఇక బాదం లేదా వేరుశెనగ వెన్న వంటి నట్ బట్టర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లను అందిస్తాయి. వీటిని కలిపి తింటే కడుపు నిండిన భావన ఏర్పడి సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఆపిల్‌ను ముక్కలుగా చేసి ఒక చెంచా సహజ నట్ బట్టర్‌తో జత చేస్తే నట్ బటర్ ఆపిల్ మిక్స్ తయారవుతుంది.
కూరగాయలు, హమ్మస్
హమ్మస్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం. క్యారెట్లు, దోసకాయలు, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలు ఫైబర్, పోషకాలను అందిస్తాయి. కూరగాయలను ముక్కలుగా చేసి మీకు ఇష్టమైన హమ్మస్‌లో ముంచి తినండి.
మిశ్రమ గింజలు
గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగి ఉంటాయి. వీటిని సులభంగా తినవచ్చు. నిజానకి ఇది అద్భుతమైన చిరుతిండిగా పనిచేస్తుంది. బాదం, వాల్‌నట్ లేదా జీడిపప్పు వంటి ఉప్పు లేని గింజలను కొద్దిగా తీసుకోండి. ఈ గింజల్లో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి తగినంత మోతాదులోనే ఆరగించండి.
పండ్లు లేదా కూరగాయలతో కాటేజ్ చీజ్
కాటేజ్ చీజ్‌లో ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీన్ని పండ్లు లేదా కూరగాయలతో తినడం వల్ల విటమిన్లు పెరుగుతాయి. ఒక గిన్నెలోకి కొంచెం కాటేజ్ చీజ్ తీసుకొని దానిపై ముక్కలు చేసిన పైనాపిల్, పీచ్ లేదా దోసకాయ వేసుకుని తినవచ్చు.
పాప్‌కార్న్ (ఎయిర్-పాప్డ్)
ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్ ఒక తృణధాన్యం. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఇది తేలికైన ఆహారం. ఆకలిని అరికట్టే అద్భుతమైన స్నాక్. మీరు ఆరోగ్యంగా ఉండటానికి అధిక వెన్న లేదా ఉప్పును ఇందులో కలపకుండా ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్‌ను తయారు చేయండి.
Read Also : Heart Diseases : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. గుండె ధమనులు మూసుకుపోతే ఏమవుతుంది..
Health Tips: శాండ్విచ్‌లు ఎంతవరకు మేలు..
Calories burned in Cricket: వామ్మో.. క్రికెట్ ఆడితే ఇన్ని కెలరీలు ఖర్చవుతాయా
Updated Date - Mar 09 , 2025 | 05:42 PM