Calories burned in Cricket: వామ్మో.. క్రికెట్ ఆడితే ఇన్ని కెలరీలు ఖర్చవుతాయా
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:37 PM
క్రికెట్ ఆడితే ఎన్ని కెలరీలు ఖర్చువుతాయో అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇంటర్నెట్ డెస్క్: యావత్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌పై దృష్టి పెట్టింది. జనాలు తమ ఫేవరెట్ టీమ్‌లను చప్పట్లు, కరతాళ ధ్వనులతో ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారికి కెలరీల ఖర్చును నిరంతరం ముదింపు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి క్రికెట్ ఆడితే ఎన్ని కెలరీలు ఖర్చవుతాయో అనే సందేహం ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. అయితే, దీనికి శాస్త్రజ్ఞులు ఎప్పుడో సమాధానం కనిపెట్టారు (Health).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, క్రికెట్ అంటే కేవలం క్రీడ మాత్రమే కాదు. శరీరం అంతటికీ వ్యాయామం అందించే కసరత్తు. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపీంగ్.. ఇలా ఏది చేసిన భారీ స్థాయిలో కెలొరీలు ఖర్చవుతాయి.
కేవలం గంట పాటు క్రికెట్ ఆడితే 300 నుంచి 600 మేర కెలరీలు ఖర్చవుతాయని నిపుణులు అంచనా వేశారు. బ్యాటింగ్, బౌలింగ్.. లేదా ఏ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నామనే దాన్ని బట్టి కెలరీలు ఖర్చు ఆధార పడి ఉంటుంది.
Prevent Night Sugar Drop: రాత్రిళ్లు షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్
బ్యాటింగ్ చేసే సమయంలో కెలరీలు బాగా ఖర్చవుతాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు, కాళ్లు, చేతులు కదుపుతున్నప్పుడు శరీరంలోని కోర్ భాగం బాగా క్రీయాశీలకం అవుతుంది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కుంటున్నప్పుడు కెలరీల ఖర్చు మరింత పెరుగుతుంది.
ఇక ఫాస్ట్ బౌలర్లు అత్యధికంగా కెలరీలను ఖర్చు చేస్తారు. బంతి విసిరేందుకు బాగా పరిగెత్తాల్సి రావడమే ఇందుకు కారణం. అయితే, ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్ బౌలర్లలో శక్తి వినియోగం కాస్త తక్కువగా ఉంటుంది.
ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యల అవకాశాలు ఎక్కువ!
ఫీల్డింగ్ చేసే వారు క్యాచులను పట్టేటప్పుడు, రనౌట్‌కు ప్రయత్నించేటప్పుడు వేగంగా స్పందించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కెలరీల ఖర్చు పెరుగుతుంది.
కాబట్టి క్రికెట్ ఆడుతూ కొవ్వు కరిగించుకోవాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బౌండరీలకు బదులు రన్స్ చేసేందుకు ప్రయత్నిస్తే కొవ్వు త్వరగా కరుగుతుంది. ఫీల్డింగ్‌లో డైవ్ చేయడం, పరిగెత్తి క్యాచ్ పట్టడం వంటివి కూడా శ్రమను పెంచి కొవ్వును కరిగిస్తాయి. వీటికితోడు స్ట్రెంత్ ట్రెయినింగ్ కసరత్తులు, పోషకాహారంతో బరువును సులువగా తగ్గించుకోవచ్చు.
Aloe vera for Bald Patches: నెత్తిపై జుట్టు ప్యాచులుగా ఊడిపోతోందా? కలబందను ఇలా వాడితే..