Prevent Night Sugar Drop: రాత్రిళ్లు షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:33 PM
రాత్రిళ్లు షుగర్ లెవెల్స్ పడిపోతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ ఉన్న వారు షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో పెట్టుకోవడం అత్యంత ఆవశ్యకం. అయితే, షుగర్ స్థాయిల విషయంలో రాత్రిళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. రాత్రిళ్లు చక్కెర స్థాయిలు తగ్గడాన్ని వైద్య పరిభాషలో నాక్టర్నల్ హైపోగ్లైసేమియా అంటారు. దీంతో, రాత్రిళ్లు నిద్ర కరువవడం అటుంచితే దీర్ఘకాలంలో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి రాత్రిళ్లు చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఏయే జాగ్రత్తలు (Health) తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రొటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలను మాత్రమే రాత్రిళ్లు తినాలి. దీంతో, రాత్రంతా బ్లడ్ గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా పడుకునే ముందు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదు.
ఉదయం లేవగానే చాలా మంది షుగర్ టెస్టు చేసుకుంటారు. రాత్రి పడుకోబోయే ముందు కూడా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే షుగర్ తగ్గడాన్ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునే వీలు చిక్కుతుంది.
ఇక సాయంత్రాలు తీవ్రంగా కసరత్తులు చేస్తే రాత్రిళ్లు ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి, రాత్రిళ్లు కసరత్తులు చేసే వారు తేలికపాటి ఎక్సర్‌సైజులను ఎంచుకుంటే మంచిది
రాత్రిళ్లు ఇన్సూలిన్ డోసు ఎక్కువైతే చక్కెరలు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటి డోసులో మార్పులు చేయాలేమో వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
Aloe vera for Bald Patches: నెత్తిపై జుట్టు ప్యాచులుగా ఊడిపోతోందా? కలబందను ఇలా వాడితే..
ఇక రాత్రి సమయాల్లో అకస్మాత్తుగా చక్కెర పడిపోయినప్పుడు గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా పండ్ల రసాలు తాగాలి. వీటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి.
మద్యం కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసాధారణ మార్పులకు లోనవుతాయి. రాత్రి సమయాల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కాబట్టి, రాత్రి సమయాల్లో వీలైనంత తక్కువగా మద్యం తాగడం మంచిది.
రాత్రిళ్లు షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది. కాబట్టి, వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే రక్త హీనత ఉన్నట్టే..