Share News

Blood Groups Disease Susceptibility: ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యల అవకాశాలు ఎక్కువ!

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:09 PM

కొన్ని బ్లడ్ గ్రూప్ వారికి కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. మరి ఈ వివరాలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం

Blood Groups Disease Susceptibility: ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యల అవకాశాలు ఎక్కువ!

ఇంటర్నెట్ డెస్క్: బ్లడ్ గ్రూప్స్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఏ రక్తం ఇవ్వొచ్చనేది బ్లడ్ గ్రూప్ పైనే ఆధార పడి ఉంటుంది. అయితే, బ్లడ్ గ్రూప్స్ ఆరోగ్యంపై కూడా కొంత వరకూ ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. కొన్ని బ్లడ్ గ్రూపుల వారికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని పేర్కొన్నాయి. మరి వివిధ ఏయే బ్లడ్ గ్రూప్స్ వారికి ఏయే వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం (Blood Groups Disease Susceptablity).

శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, ఏబీ, బీ బ్లడ్ గ్రూపుల వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. రక్తంలో అధిక కొలెస్టెరాల్ క్లాటింగ్ ప్రొటీన్లే ఇందుకు కారణం. అయితే, ఓ బ్లడ్ గ్రూపు ఉన్న వారికి గుండె జబ్బుల అవకాశాలు తక్కువని తేలింది. కాబట్టి, ఏబీ, ఏ బ్లడ్ గ్రూపులు ఉన్న వారు క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయడం, కాలుష్యం దరిచేరనివ్వకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే గుండె జబ్బులు రావు


Aloe vera for Bald Patches: నెత్తిపై జుట్టు ప్యాచులుగా ఊడిపోతోందా? కలబందను ఇలా వాడితే..

ఇక బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వారికి ఉదర సంబంధిత సమస్యలకు అవకాశాలు ఎక్కువ. కడుపులో అల్సర్లు, లేదా చర్మ సంబంధిత సమస్యలు ఈ బ్లడ్ గ్రూపు వారికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇలాంటి వారు చేపలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు అధికంగా తినాలి.

ఇక ఏబీ బ్లడ్ గ్రూపు వారికి వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్రొటీన్ సంబంధిత సమస్యలే ఇందుకు కారణం. వీరిలో జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి


Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే రక్త హీనత ఉన్నట్టే..

ఏ,బీ బ్లడ్ గ్రూపుల వారిలో రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఎక్కువ. దీంతో, వీరికి స్ర్టోక్ వచ్చే అవకాశాలు అధికమని వైద్యులు చెబుతున్నారు.

ఏ బ్లడ్ గ్రూపు వారికి ఒత్తిడితో సమస్యలు ఎక్కువ. వీళ్లల్లో ఒత్తిడి కారక కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడమే ఇందుకు కారణం. కాబట్టి, ఈ పరిస్థితిని అధిగమించేందుకు కంటి నిండా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం అవసరం. పుట్టుకతో వచ్చే బ్లడ్ గ్రూప్‌ను మార్చలేము కాబట్టి రాబోయే సమస్యలపై అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలను సులువుగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Mar 08 , 2025 | 04:10 PM