ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Type 5 Diabetes: టైప్‌ 5 మధుమేహం గురించి విన్నారా

ABN, Publish Date - May 06 , 2025 | 03:08 AM

పోషకాహార లోపంతో సంబంధమున్న టైప్‌5 మధుమేహానికి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది వంశపారంపర్యంగా వచ్చే రుగ్మతగా కౌమార దశలో ఎక్కువగా కనిపించుతోంది

Diabetes

హెల్త్‌ న్యూస్‌

క్తంలో ఇన్సులిన్‌ మోతాదు పెరిగితే, దాన్ని టైప్‌2 మధుమేహంగా నిర్థారిస్తారు. మరి ఇన్సులిన్‌ తగ్గితే? రక్తంలో సరిపడా ఇన్సులిన్‌ లేని పరిస్థితి, టైప్‌5 మధుమేహంగా అధికారిక గుర్తింపు పొందింది. మరిన్ని వివరాలు...

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే పోషకాహార లోపంతో సంబంధమున్న మధుమేహాన్ని గుర్తించడం జరిగింది. ఈ రకమైన మధుమేహం తాజాగా అధికారిక గుర్తింపును దక్కించుకుంది. అంతర్జాతీయ డయాబెటిస్‌ ఫెడరేషన్‌, ఈ మధుమేహాన్ని టైప్‌5 మధుమేహంగా వర్గీకరించింది. 70 ఏళ్ల క్రితమే ఈ మధుమేహాన్ని గుర్తించినప్పటికీ ప్రపంచ ఆరోగ్య చర్చల్లో దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. 20వ శతాబ్దంలోనే వెలుగులోకొచ్చిన ఈ పరిస్థితిని టైప్‌1 లేదా టైప్‌2 మధుమేహంగా తప్పుగా వర్గీకరించారు.


ఈ అసాధారణమైన మధుమేహం, ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల్లోని పోషకాహారలోపంతో బాధపడే యువతను పట్టి పీడిస్తున్నట్టు, 160 దేశాల్లోని 250 జాతీయ డయాబెటిక్‌ అసోసియేషన్లు అంచనా వేసినట్టు అంతర్జాతీయ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ పేర్కొంటోంది. దీర్ఘకాలం పాటు పోషకాహార లోపంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గి టైప్‌5 మధుమేహం పెరుగుతోంది. ప్రత్యేకించి కౌమార దశలో బయల్పడే ఈ మధుమేహానికి ఒక జన్యులోపమే కారణం. ఈ రకమైన జన్యు ఉత్పరివర్తనం తల్లితండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది. అయితే టైప్‌5 మధుమేహానికి ఇటీవలే అధికారిక గుర్తింపు లభించింది కాబట్టి వ్యాధినిర్థారణ, చికిత్సా విధానాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి చేపట్టిన పరిశోధన ఆధారంగా ఈ రుగ్మతకు సంబంధించి మరో రెండేళ్లలో మార్గదర్శకాలను అభివృద్ధి చేయనున్నట్టు అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్‌ ప్రకటించింది.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 07:53 AM