ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Issue: మెట్లు ఎక్కిన తర్వాత మీకు ఊపిరి ఆడటం లేదా.. ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..

ABN, Publish Date - May 23 , 2025 | 08:17 AM

మెట్లు ఎక్కిన తర్వాత మీకు ఊపిరి ఆడటం లేదా? అయితే, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Stairs

కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మీకు ఊపిరి ఆడటం లేనట్లుగా అనిపిస్తుందా? అయితే, ఇది కేవలం వృద్ధాప్యం లేదా అలసట వల్ల వస్తుందని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తక్కువ శారీరక శ్రమతో కూడా ఊపిరి ఆడకపోవడం సాధారణం విషయం కాదు. కాబట్టి, దానిని నిర్లక్ష్యం చేయకండి. నిజానికి, ఇది ఐదు ప్రధాన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


రక్తహీనత

బలహీనత, అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటే అది రక్తహీనతకు సంకేతం కావచ్చని నిర్ధారించుకోండి. రక్తహీనత ఉన్నప్పుడు మీరు కొన్ని మెట్లు ఎక్కినా కూడా మీకు ఊపిరి ఆడటం లేనట్లుగా అనిపిస్తుంది.

గుండె జబ్బులు

మెట్లు ఎక్కేటప్పుడు మీకు తల తిరగడం, కాళ్ళ వాపు లేదా ఛాతీ నొప్పి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది గుండె సమస్యను కూడా సూచించవచ్చు.

ఊపిరితిత్తుల సమస్య

ఊపిరితిత్తుల ముఖ్య ఉద్దేశ్యం మన శరీరాలకు ఆక్సిజన్ అందించడం. అయితే, ఊపిరితిత్తులలో ఏదైన సమస్య ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ILD), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అన్నీ ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. మీరు దగ్గు, గురక లేదా ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను కలవండి.

ఒత్తిడి, ఆందోళన

శ్వాస ఆడకపోవడం అనేది అప్పుడప్పుడు ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా వస్తుంది.

అధిక బరువు ఉండటం

.ఊబకాయం కారణంగా గుండె ఎక్కువగా పనిచేయవలసి రావడం వల్ల శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. కాబట్టి, ఈ విషయంపై జాగ్రత్తగా ఉండండి.


Also Read:

ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: సీపీఐ

For More Health And National News

Updated Date - May 23 , 2025 | 08:39 AM