DeepSleep: కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు
ABN, Publish Date - May 11 , 2025 | 10:40 PM
కొందరు రాత్రిళ్లు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయినా యాక్టివ్‌గా ఉండటం వెనుక ఓ జన్యు ఉత్పరిణామం కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి రాత్రిళ్లు 10 గంటల పాటు నిద్రపోయినా పగటి పూట నిద్రమత్తుతో తూగుతూ ఉంటారు. మరికొందరికి రాత్రి 4 గంటల నిద్ర దొరికినా సరిపోతుంది. మరుసటి రోజంగా చలాకీగా ఉంటారు. ఇలా ఎందుకో శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్యుపరమైన మార్పులే ఈ పరిస్థితికి కారణమని వివరించారు.
ఈ జన్యుమార్పు కారణంగా కొందరిలో జీవగడియారంలో పెద్ద మార్పే వస్తుందట. ఫలితంగా వారి నిద్ర స్వల్ప సమయమైనా మంచి నాణ్యతతో గాఢ నిద్రగా ఉంటుందట. మనుషుల్లో ఈ జన్యుమార్పును ఎస్ఐకే-ఎన్783గా గుర్తించారు. ఎలుకల్లో ఈ జన్యువుకు మార్పు చేసినప్పుడు ఫలితాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ఈ జన్యుమార్పు ఉన్న ఎలుకలు సాధారణ ఎలుకలతో పోలిస్తే 31 నిమిషాలు తక్కువగా నిద్రించాయి. జన్యుమార్పులను నిద్రకు దూరం చేసినా కూడా మిగతా వాటితో పోలిస్తే 54 నిమిషాలు తక్కువగా నిద్రపోయాయట.
ఈ జన్యుమార్పు కారణంగా ప్రొటీన్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఫాస్ఫేట్‌ను బదిలీ చేసే సామర్థ్యంలో మార్పు కనిపిస్తుందని అంటున్నారు. అంతిమంగా ఇది జీవగడియారం, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో సతమతమయ్యే వారి చికిత్సలో ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ జన్యుమార్పు ఉన్న వారు తక్కువ నిద్ర పోయినా కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావాలకూ లోనుకారని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ వ్యక్తులు నిద్రకు దూరమైతే ఆల్జైమర్స్, గుండె సంబంధిత సమస్యలు, మెదడు సామర్థ్యం తగ్గడం వంటి ఇబ్బందులకు లోనవుతారు.
ఇవి కూడా చదవండి:
ఈ సింపుల్ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
Updated Date - May 12 , 2025 | 01:39 PM