Best Time To Eat Sugar: ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:31 PM
మధ్యాహ్న భోజనం తరువాత స్వీట్స్ తింటే శరీరంపై చక్కెరల ప్రభావం తక్కువగా ఉంటుందని ఓ ఫ్రెంచ్ బయోకెమిస్ట్ నెట్టింట చేసిన సూచన వైరల్ అవుతోంది. చక్కెర స్థాయిల్లో ఎగుడుదిగుడులు స్వల్పంగా ఉంటాయని ఆమె వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: స్వీట్స్ అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. కానీ ఇలాంటి ప్రాసెస్డ్ చక్కెరలు ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలా? లైఫ్‌లో చిన్న చిన్న ఆనందాలకు కూడా దూరం కావాలా? అంటే అస్సలు అవసరం లేదని అంటున్నారు ఫ్రెంచ్‌కు చెందిన బయోకెమిస్ట్ జెస్సీ. జార్జి టౌన్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మందికి ఆహారం విషయంలో మార్గనిర్దేశం చేస్తుంటారు. ఆమెకు కంగా 5.6 మిలియన్‌ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
జెస్సీ చెప్పే దాని ప్రకారం, భోజనం తరువాతే స్వీట్ తినేందుకు అత్యంత అనుకూల సమయం. ఉదయాన్నే లేదా పరగడుపును స్వీట్స్ ఇతర చక్కెర పదార్థాలు అస్సలు తినకూడదని అంటుంటారు. ‘‘మీకు నిజంగా చక్కెర పదార్థాలు తినాలని ఉంటే మధ్యాహ్నం వేళ భోజనం తరువాత తినండి. దీంతో, డోపమైన్ అత్యధిక స్థాయిలో విడుదలై ఫుడ్‌ను బాగా ఆస్వాదించామన్న భావన కలుగుతుంది. ఈ సమయంలో స్వీట్స్‌తో శరీరంపై పడే ప్రభావం కూడా తక్కువే’’ అని జెస్సీ చెప్పుకొచ్చింది. ఉదయాన్నే ఎట్టిపరిస్థితుల్లో స్వీట్స్ తినకూడదు. మధ్యాహ్న భోజనం తరువాతే డెసర్ట్ కింద స్వీట్స్ తినాలని ఆమె పేర్కొంది.
దీని వెనక లాజిక్‌ను కూడా జెస్పీ వివరించింది. ‘‘ఉదయాన్నే ఖాళీ కడుపుతో స్వీట్స్ తింటే అవి త్వరగా అరిగిపోతాయి. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తరువాత 90 నిమిషాలకు మళ్లీ తగ్గిపోతాయి. దీంతో, మళ్లీ ఏదైనా తినాలన్న ఆలోచన మొదలవుతుంది. అలా ఆ విషయం వలయం రోజంతా కొనసాగుతుంది. నిత్యం ఏదోకటి తింటూ పెరిగే షుగర్ స్థాయిలతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది’’ అని ఆమె వివరించారు.
అదే మధ్యాహ్నం భోజనం తరువాత తింటే.. స్వీట్స్‌లోని చక్కెరలను శరీరం అంత త్వరగా గ్రహించలేదని జెస్సీ పేర్కొంది. అప్పటికే తిన్న ఆహారంలోని ప్రొటీన్లు, పీచు పదార్థం, ఆరోగ్యకర కొవ్వులు వంటివన్నీ చక్కెరను శరీరం త్వరగా గ్రహించకుండా అడ్డుపడతాయి. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలో భారీగా పెరగవని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!