Simple Method to Remove Microplastics: ఈ సింపుల్ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు
ABN , Publish Date - May 04 , 2025 | 09:16 AM
Scientists Discover Simple Method to Remove Microplastics from Drinking Water pcs spl
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జనాలను అమితంగా భయపెడుతున్న సమస్య మైక్రోప్లాస్టిక్స్. ఈ సూక్ష్మ ప్లాస్టిక్స్ రేణువులతో ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత తీవ్ర మవుతోంది. మైక్రోప్లాస్టిక్స్‌తో క్యాన్సర్, వంద్యత్వం, శ్వాసకోస సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు అనేకం వస్తాయని చెబుతున్నారు. మైక్రోప్లాస్టిక్స్‌తో గర్భస్థ శిశువులకు కూడా ముప్పు ఉన్నట్టు ఇటీవలే గుర్తించారు.
ఏమిటీ మైక్రో ప్లాస్టిక్స్..
5 మిల్లీ మీటర్ల కంటే తక్కువ సైజు ఉండే ప్లాస్టిక్ రేణువులను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. వీటిలో కొన్ని పారిశ్రామిక అవసరాల కోసం ఉత్పత్తి చేస్తారు. పెద్ద ప్లాస్టిక్ వస్తువులు చిన్న చిన్న రేణువులుగా మారినప్పుడు కూడా పర్యావరణంలోకి ప్లాస్టిక్ రేణువులు విడుదల అవుతాయి.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఆహారం, గాలి ద్వారా మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి చేరుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో చర్మంలోపలికి కూడా చొచ్చుకుపోయి శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే, ఈ మైక్రోప్లాస్టిక్స్ సమస్యను పరిష్కరించేందుకు ఓ సులువైన మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
చైనాలోని గాంగ్జో మెడియకల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీలు ఈ విధానం ప్రాముఖ్యతను ఓ అధ్యయనంలో గుర్తించాయి. నీటిని మరిగించి వడకడితే మైక్రోప్లాస్టిక్స్ 90 శాతం తొలగిపోతాయని నిపుణులు గుర్తించారు. నల్లా నీటిని మరిగించడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ అన్ని ఒక దగ్గర పేరుకుపోయి వడకట్టేందుకు అనువుగా మారతాయని అన్నారు.
ఇక లవణాలు అధికంగా ఉండే హార్డ్ వాటర్‌లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను తొలగించడం మరింత సులువని కూడా చెప్పారు. ఈ నీటిని మరిగించినప్పుడు ఇందులోని లవణాలు.. మైక్రోప్లా్స్టిక్స్‌తో కలిసి పెద్ద రేణువులుగా మారతాయని చెప్పారు. దీంతో, వడకట్టినప్పుడు ఇవి త్వరగా తొలగిపోతాయని అన్నారు.
మైక్రోప్లాస్టిక్స్ తొలగించేందుకు అందరికీ అందుబాటులో ఉండే ఈ విధానాన్ని జనాల మరింత విస్తృతంగా వాడితే ప్రజారోగ్య పరిరక్షణ మరింత మెరుగవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?