ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Belly Fat: జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ చిన్నపాటి అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..

ABN, Publish Date - May 03 , 2025 | 02:08 PM

How To Lose Belly Fat Fast: ఈ రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం చాలామందిలో కనిపిస్తున్న సర్వసాధారణ సమస్య. ఇది ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే, ముందుకు పొడుచుకొచ్చినట్టుగా ఉండే కడుపు కొన్నిసార్లు ఇబ్బందికి కారణమవుతుంది. కానీ, జిమ్ లేదా డైట్ చేయకుండానే ఈ చిన్న చిన్న అలవాట్లతో బొడ్డు కొవ్వును తగ్గించుకోవచ్చు.

Effective Tips To Reduce Belly Fat

Effective Tips To Reduce Belly Fat: రోజంతా ఆఫీసులో గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగడమే కాదు. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడటానికి ఈ అలవాట్లే కారణం. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం సమస్య నూటికి తొంభై మందిలో కనిపిస్తోంది. ఈ సమస్య ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ముందుకు పొడుచుకొచ్చిన పొట్ట శరీర అందాన్ని పాడు చేస్తుంది. నచ్చిన దుస్తులు వేసుకోలేరు. కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేస్తుంది. అందుకే దీనిని సకాలంలో నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.


పొట్ట కొవ్వు తగ్గించుకునేందుకు ప్రజలు తరచుగా జిమ్, కఠినమైన డైటింగ్‌ను ఆశ్రయిస్తారు. అయితే, కొన్నిసార్లు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కొవ్వు కొంచెం కూడా కరగదు. అలాగే, ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం లేదా సరైన ఆహారం పాటించడం కూడా అంత సులభం కాదు. అందువల్ల, మీరు మీ దినచర్యలో ఈ అలవాట్లను చేర్చుకోండి చాలు. బెల్లీ ఫ్యాట్ అనే సమస్య పూర్తిగా పోతుంది.


బెల్లీ ఫ్యాట్ తగ్గించే అలవాట్లు

  • పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. రోజూ మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులను చేర్చుకోండి.

  • ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా వేయించిన ఆహారం వంటి అనారోగ్యకరమైన ఆహారాలను నివారించండి.

  • పొట్ట కొవ్వు త్వరగా తగ్గాలంటే రోజంతా ఏదో ఒకటి తినే అలవాటును మానేయండి. అలాగే, నిర్ణీత సమయాల్లో పరిమిత పరిమాణంలో తినండి.


  • శరీరంలో నీటి లోపం రాకుండా జాగ్రత్త వహించండి . రోజుకు కనీసం 7 నుండి 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు జీవక్రియను పెంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

  • అధిక తీవ్రత కలిగిన వ్యాయామం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొవ్వు కరిగి కండరాలు దృఢంగా మారుతాయి.

  • బరువును నియంత్రించుకోవడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.


  • ఒత్తిడిని నియంత్రించుకోండి. ఎందుకంటే ఒత్తిడి ఆకలి, కోరికలను పెంచుతుంది. అతిగా తినేలా ప్రోత్సహించి ఊబకాయానికి దారితీస్తుంది.

  • ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ కలిగిన ఏదైనా పానీయం కొవ్వును పెంచుతుంది. కాబట్టి, బొడ్డు కొవ్వును తగ్గించుకోవడానికి అలాంటి పానీయాలను నివారించండి.

  • అధిక చక్కెర కూడా కొవ్వు పెరగడానికి దోహదం చేస్తుంది. అందువల్ల బొడ్డు కొవ్వును తగ్గించడానికి చక్కెరను నివారించడం మంచిది.


Read Also: Heatwave Alert: మే నెల వచ్చేసింది.. హీట్ వేవ్స్ వల్ల ఈ సమస్యలు.. జాగ్రత్త..

Healthy Breakfast Ideas: ఉదయం నిద్రలేవగానే ఆకలిగా అనిపిస్తోందా.. బెస్ట్ ఫుడ్ ఐడియాస్ మీకోసం..

Anger Issues: మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..

Updated Date - May 03 , 2025 | 02:09 PM