ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డిప్రెషన్‌ వేళ.. ఏం తినాలి

ABN, Publish Date - Aug 17 , 2025 | 11:22 AM

దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, సరైన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు వంటి అనేక కారణాల వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం, పని తీరును, తద్వారా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

నేను సంవత్సరం నుంచి డిప్రెషన్‌ ట్రీట్మెంట్‌లో ఉన్నాను. డాక్టర్‌ గారు నాన్‌ వెజ్‌ తగ్గించాలని, టీ కాఫీలు పూర్తిగా మానేయాలని సూచించారు. ఇంకా ట్రీట్మెంట్‌ కొనసాగుతోంది. డిప్రెషన్‌ నుంచి త్వరగా బయట పడాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో దయచేసి సూచించగలరు.

- రమణ, హైదరాబాద్‌

దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, సరైన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు వంటి అనేక కారణాల వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం, పని తీరును, తద్వారా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నిరాశ, ఆందోళనలను నివారించడానికి సమతులాహారం సహాయపడుతుంది. ఒమేగా- 3 కొవ్వులు అధికంగా ఉండే చేపలు.. థియోబ్రొమైన్‌, ఫ్లేవనాయిడ్స్‌ ఉన్న ముదురు చాక్లెట్స్‌.. ప్రోబయాటిక్స్‌ ఉండే పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలు.. స్వతహాగా తియ్యగా ఉండే అరటి, ఆపిల్‌ లాంటి పండ్లు.. పాలీఫీనాల్స్‌తో ముదురురంగులో ఉండే దానిమ్మ, నల్ల ద్రాక్ష.. పోషకాలు ఎక్కువ ఉండే ముడి ధాన్యాలు, గింజలు.. బీ విటమిన్లు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు మొదలైనవన్నీ మానసిక స్థితిని ఉత్సాహపరిచే ఆహారంగా పరిశోధనలు తెలుపుతున్నాయి.

నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. మెచ్యూర్‌ అయి సంవత్సరమైంది కానీ ఇప్పటికీ నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను. నాకు ఎత్తు పెరగాలనే ఆశ ఉంది. దయచేసి ఎత్తు పెరగడానికి ఏం చేయాలో సూచించగలరా?

- ప్రణీత, తిరుపతి

సాధారణంగా ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణం. ముఖ్యంగా ఆడపిల్లల్లో 14-15 ఏళ్ళ వయసుకు ఎత్తుకు సంబంధించి ఎదుగుదల చాలా వరకు ఆగిపోతుంది. మెచ్యూర్‌ అయినా ఒకటి రెండు సంవత్సరాల వరకు ఒకటిన్నర అంగుళం వరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది కానీ అంతకు మించి ఉండకపోవచ్చు. అయితే ఎదిగే వయసులో ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎత్తు పూర్తిగా పెరగకపోయే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైనది ఎముకల ఆరోగ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్‌ డీ సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు,

మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు తీసుకోవచ్చు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్‌ మొదలైన ఆహార పదార్థాల్లో క్యాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటరు నుంచి ముప్పావు లీటరు పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటే సరిపడా క్యాల్షియం లభిస్తుంది. విటమిన్‌ డీ కోసం రోజుకు కనీసం ఓ అరగంట ఎండలో గడపాలి. ఇలా ఆహారంలో జాగ్రత్తలతో పాటు వ్యాయాయం కూడా చేస్తే మంచిది. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఏదైనా ఆట ఆడడం వంటివేవైనా కూడా వ్యాయామం లాంటివే.

నాకు 76 సంవత్సరాలు. 30 ఏళ్ళ నుండి డయాబెటీస్‌ ఉంది. గత ఏడాది నుండి నా రెండు అరి కాళ్ళల్లో మంటలు (తిమ్మిర్లు) వచ్చి ఏ ఆయిం ట్మెంట్‌ రాసినా, డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడు తున్నా తగ్గడం లేదు. తరుణోపాయం తెలుపగలరు.

- బాలాజీ, కర్నూల్‌

దీర్ఘకాలంపాటు రక్తంలో చక్కర స్థాయి అధికంగా ఉన్నట్టయితే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, మొద్దుబారడం, మంటలుగా ఉండడం, అప్పుడప్పుడు నొప్పిగా ఉండడం జరగవచ్చు. దీనిని డయాబెటిక్‌ న్యూరోపతి అంటారు. ఇకపై నరాలు దెబ్బతినకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయవలసిన పని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. దీనికోసం మీరు వైద్యుల సలహా మేరకు సమయా నికి మందులు వాడాలి. అలాగే ఆహారంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే తెల్ల అన్నం, మైదా పిండితో చేసే పదార్థాలు, పంచదార, బెల్లం, దుంపలు మొదలైనవి చాలా తక్కువ తీసుకోవాలి లేదా పూర్తిగా మానెయ్యాలి. తెల్ల అన్నం బదులుగా బ్రౌన్‌ రైస్‌ గోధుమ లేదా జొన్న రొట్టె, రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన జావలు లేదా రొట్టెలు తీసుకోవడం మేలు. ఈ విషయాన్ని మీ వైద్యులు లేదా పోషకాహార నిపుణులతో చర్చించి తీసుకునే మందులకు అనుగుణంగా ఆహార వేళలు నిర్ణయిస్తే మంచిది. అన్నం కానీ, రొట్టె కానీ ఏది తీసుకున్నా సరే కూర పరిమాణం, పప్పు పరిమాణం ఎప్పుడూ అన్నం కన్నా ఎక్కువే ఉండాలి. ప్రతి పూటా తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2025 | 11:22 AM