ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hungry: తిన్న తర్వాత కూడా ఆకలిగా ఉందా.. ఎందుకో తెలుసుకోండి..

ABN, Publish Date - Jun 04 , 2025 | 09:16 AM

మన ఆహారపు అలవాట్లపై మనం శ్రద్ధ వహించాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా శరీరంపై చెడు ప్రభావం ఉంటుంది. అయితే, కొంతమందికి తిన్న తర్వాత కూడా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..

Hungry

Hungry : మన ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటారు. ఇంకొంత మంది టైం ప్రకారం తింటారు. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తినే వారు ఉన్నారు. అయితే, కొన్నిసార్లు ఎంత తిన్నా కూడా కడుపు నిండదు. ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తే, శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం. భోజనం తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిగా అనిపిస్తే దాని వెనుక 5 కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రోటీన్, ఫైబర్ లేకపోవడం

శరీరంలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు లేకపోవడం వల్ల ఎంత తిన్నా కూడా మీకు ఇంకా తినాలని అనిపిస్తుంది. ఈ రెండు కడుపు చాలా సేపు నిండినట్లు అనిపించేలా చేస్తాయి. అనవసరమైన ఆకలి కోరికల నుండి మీకు విముక్తిని కలిగిస్తాయి. ఇవి లేకపోవడం వల్ల మీకు పదే పదే ఆకలి వేస్తుంది. అందువల్ల, మీ భోజనంలో కచ్చితంగా ప్రోటీన్, ఫైబర్ వంటి పోషక ఆహారాలు ఉండేలా చూసుకోండి. ఈ రెండు పోషకాలు ఆకలిని నివారించడంలో సహాయపడుతాయి.

నీటి కొరత

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తే, మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం. కాబట్టి, రోజుకు 8 గ్లాసుల నీరు తాగండి. తినేటప్పుడు కొంచెం నీరు కూడా తాగండి.

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం

భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు. మీరు డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్ అయితే మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోని తగిన జాగ్రత్తలు తీసుకోండి.

త్వరగా తినే అలవాటు

మీకు త్వరగా ఆహారం తినే అలవాటు ఉంటే ఆ అలవాటు మంచిది కాదు. ఆహారాన్ని మీ నోటిలో బాగా నమిలి, ఆపై మింగండి. ఇలా చేస్తే తిన్న వెంటనే మీకు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది.

కేలరీలు తీసుకోకపోతే

ఆహారంలో సరైన మొత్తంలో కేలరీలు తీసుకోకపోతే, తిన్న తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తుంది. మీ శరీరం కూడా బలహీనంగా మారవచ్చు. మీరు వ్యాయమం ఎక్కువగా చేస్తుంటే దానికి తగ్గట్టు కేలరీలు కూడా తీసుకోవాలి.


ఈ అలవాట్లను అలవాటు చేసుకోండి

  • ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి.

  • రోజంతా పుష్కలంగా నీరు తాగండి.

  • మధ్యాహ్న భోజనంలో పోషకమైన ఆహారం తీసుకోండి.

  • నెమ్మదిగా తినండి, ఆహారాన్ని బాగా నమలండి.

  • అనవసరమైన ఒత్తిడిని నివారించండి.

  • రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించండి.

  • ప్రతిరోజూ 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి.

  • మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఉదయం టీ, పాలకు బదులుగా.. ఈ 4 పానీయాలు తాగితే సూపర్ బెనిఫిట్స్

ఎక్కువగా ప్రోటీన్ షేక్ తాగుతున్నారా.. జాగ్రత్త..

For More Health News

Updated Date - Jun 04 , 2025 | 10:54 AM