ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gut Health: తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

ABN, Publish Date - May 18 , 2025 | 07:40 PM

Poor Gut Health Symptoms: ఆహారం తిన్న తర్వాత ఈ ఐదు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా సాధారణ సమస్యేనని భావించి నిర్లక్ష్యం చేయకండి. ఈ పొరపాటు వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి, పేగు ఆరోగ్యం దెబ్బతినకముందే ఆ లక్షణాలేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.

Poor Gut Health Symptoms

Indigestion After Eating: ఏ వ్యాధి అయినా వచ్చే ముందు శరీరం చాలా సంకేతాలను ఇస్తుంది. ఈ లక్షణాలు ఏవో తెలుసుకుని ముందే అప్రమత్తమైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల మీలో ఉన్నట్లయితే తిన్న తర్వాత తరచుగా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాలను సకాలంలో అర్థం చేసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం తిన్న అరగంట తర్వాత ఈ 5 రకాల సమస్యలు మీరు అనుభవిస్తున్నట్లయితే.. మీ పేగు ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. దీనిని వెంటనే పరిష్కరించుకోవడం అవసరం. ఆలస్యం చేస్తే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి, తిన్న తర్వాత ఈ కింది లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.


నిద్రలేమి

తిన్న తర్వాత కాస్త కునుకు పట్టడం సహజం. కానీ, పేగు ఆరోగ్యం దెబ్బతిన్నవారికి నిద్రలేమి సమస్య ఉంటుంది. తిన్న అరగంట తర్వాత శరీరం నీరసంగా అనిపిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతోందనేందుకు ఇది సూచన. ఇలాంటి సమస్య తరచూ ఎదురవుతుంటే రక్తంలో చక్కెర స్థాయిని పెంచని ఆహారాన్ని తినవలసిన అవసరం ఉంది.


త్రేన్పులు

తిన్న అరగంట తర్వాత పెద్ద మొత్తంలో త్రేనుపు రావడం ప్రారంభమైతే కడుపులో ఆమ్లం తక్కువగా ఉందని అర్థం. అటువంటి పరిస్థితి ఎదురైతే త్రేనుపు తగ్గించుకోవడానికి యాంటాసిడ్ వంటి మాత్రలు తీసుకోవడం మర్చిపోవద్దు.


ఉబ్బరం

తిన్న అరగంట తర్వాత చాలామందికి కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే మీరు తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదని అర్థం. శరీరంలో పోషకాలను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియ కోసం ఆహారాన్ని ముందుకు కదిలించే ఎంజైములు కడుపులో ఉత్పత్తి కాకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.


ఛాతీ బిగుసుకుపోవడం

శరీరానికి సరిపడని ఆహారం తీసుకోకపోవడం వల్లనే భోజనం చేసిన అరగంట తర్వాత ఛాతీలో బిగుతుగా అనిపిస్తుంది. ఇది గమనించుకుని అలాంటి ఆహారాన్ని తినకుండా ఉండండి.


వాష్‌రూమ్‌కి

భోజనం చేసిన వెంటనే వాష్‌రూమ్‌కి పరిగెత్తడం అనే అలవాటు పేలవమైన గట్ ఆరోగ్యానికి సంకేతం. ఈ లక్షణాలుంటే గట్ డైస్బియోసిస్ లేదా లీకీ గట్ సిండ్రోమ్‌కు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరిగేలా జీవనశైలి, డైట్ అనుసరించాలి.


Read Also: Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..

Blood Pressure: ఉప్పు వల్లే కాదు.. ఇవి తిన్నా బీపీ అమాంతం పెరిగిపోతుంది..

Egg Diet Tips: రోజూ ఎన్ని గుడ్లు తినాలి.. అతిగా తినడం వల్ల ఈ సమస్యలు వస్తాయా..

Updated Date - May 18 , 2025 | 07:58 PM