Bihar Elections: ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ
ABN, Publish Date - Oct 18 , 2025 | 06:30 PM
భోజ్‌పురి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్‌కు మరహోరా నియోజకవర్గం నుంచి ఎల్‌జేపీ (ఆర్‌వీ) టిక్కెట్ ఇవ్వడంతో ఆమె అక్కడ గట్టిపోటీదారుగా నిలిచారు. ప్రచారం కూడా చేపట్టారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే (NDA)కు గట్టి షాక్ తగిలింది. సారణ్ జిల్లా మరహోరా నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యాయి. వీరిలో ఎన్డీయే కూటమి తరఫున లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీమా సింగ్ (Seema Singh) కూడా ఉన్నారు. తక్కిన ముగ్గురిలో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసిన జేడీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు అల్టాఫ్ ఆలం రాజు, బీఎస్‌పీకి చెందిన ఆదిత్య కుమార్, స్వతంత్ర అభ్యర్థి విషాల్ కుమార్ ఉన్నారు. నామినేషన్లలో లోపాల కారణంగా వాటిని రద్దు చేసినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
భోజ్‌పురి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్‌కు మరహోరా నియోజకవర్గం నుంచి ఎల్‌జేపీ (ఆర్‌వీ) టిక్కెట్ ఇవ్వడంతో ఆమె అక్కడ గట్టిపోటీదారుగా నిలిచారు. ప్రచారం కూడా చేపట్టారు. అయితే నామినేషనల్‌లో పొరపాటు కారణంగా ఆమె నామినేషన్‌ను అనర్హమైనదిగా అధికారులు తాజాగా ప్రకటించారు. దీంతో ఇప్పుడ మరహోరా నియోజకవర్గంలో పోటీ ఆర్జేడీ, జన్‌సురాజ్‌ల మధ్యే ఉండనుంది. ఆర్జేడీ తరఫున జితేంద్ర రాయ్ పోటీ చేస్తుండగా, జన్ సురాజ్ నుంచి అభయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. జితేంద్ర రాయ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు బిహార్ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. బిహార్ తొలివిడత నామినేషన్ల గడువు ఈనెల 17వ తేదీతో ముగిసింది.
బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
పాక్‌లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లో ఉంది.. రాజ్‌నాథ్ వార్నింగ్
ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో భారీ అగ్నిప్రమాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 18 , 2025 | 06:37 PM