Home » Bihar Elections
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టి(ఆదివారం)తో ముగియనుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు తొలివిడత పోలింగ్ ముగిసింది.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది.
ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు.