Delhi MP Flats: ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Oct 18 , 2025 | 02:22 PM
రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్‌లలో కొంచెంసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటనకు కారణం ఇంకా తెలియలేదు. చుట్టుపక్కల..
ఢిల్లీ, అక్టోబర్ 18: రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ మంటలు, పెద్దఎత్తున పొగలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటనకు కారణం ఇంకా తెలియలేదు. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. పదిహేనుకు పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపించాయని, పొగ విషపూరితమా, లేదా? అని తనిఖీ చేస్తున్నామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్లు ఎంపీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి కావడంతో, ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర భవనంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక ఎంపీల అపార్ట్‌మెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఈ భవనంలో చాలా మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివాసం ఉంటున్నారు. దీంతో ప్రమాదానికి గల కారణాలపై పెద్దఎత్తున దర్యాప్తు మొదలైంది.

ఇవి కూడా చదవండి:
Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
BRS On BC Reservations: రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం: బీఆర్ఎస్ నేతలు