Share News

Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:10 PM

సత్తుపల్లిలో బీసీ బంద్‌‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

ఖమ్మం: సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముస్లీంలకు 42% బీసీ రిజర్వేషన్‌లలో స్థానం‌ కల్పించటంపై నాయకుల మధ్య రగడ చెలరేగింది. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య మాటమాట పెరిగి తోపులాట జరిగింది.


సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్‌‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ.. కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అనంతరం ముస్లీంలకు 42% బీసీ రిజర్వేషన్‌లలో స్థానం‌ కల్పించటంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు. ముస్లీంలకు రిజర్వేషన్ కల్పిస్తే.. మీకేంటి అభ్యంతరం అంటూ కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల నాయకులను చెదరకొట్టారు.


ఇవి కూడా చదవండి:

ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్‌ ప్రయోగం

ఏపీకి పీఎం జన్‌మన్‌ అవార్డులు

Updated Date - Oct 18 , 2025 | 02:01 PM