Jubilee Hills By Poll: విత్ డ్రా పూర్తి.. జూబ్లీహిల్స్ రేసులో నిలిచింది ఎందరంటే
ABN, Publish Date - Oct 24 , 2025 | 03:40 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్ వేయగా.. వారిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills By Poll) నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఫైనల్‌గా ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. నేటితో నామినేషన్లకు చివరి తేదీ కాగా.. దాదాపు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్ వేశారు. ఇందులో నేషనల్, స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థులు ముగ్గురు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 27 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 51 మంది నామినేషన్ వేశారు. ఇప్పుడు వారిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
చివరగా 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయించనున్నారు.
ఇవి కూడా చదవండి...
పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 24 , 2025 | 03:51 PM