Bihar Elections: రూ.30,000 జీతంతో ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాం... తేజస్వి హామీ
ABN, Publish Date - Oct 22 , 2025 | 03:25 PM
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.
పాట్నా: బిహార్‌లో విపక్ష 'మహాఘట్‌బంధన్' (Mahaghathbandahan) అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 'జీవికా సీఎం దీదీలు' (Jeevika CM Didis) అందరికీ రూ.30,000 జీతంతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ఇచ్చారు. జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వాగ్దానం చేశారు.
'ఈ ప్రభుత్వంలో జీవికా దీదీలకు అన్యాయం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మేము వారి నెలసరి వేతనాన్ని రూ.30,000కు పెంచాలని నిర్ణయించాం. ఇది ఆషామాషీ ప్రకటన కాదు. ఇది జీవికా దీదీల చిరకాల డిమాండ్' అని తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
తేజస్వి కీలక హామీలు
జీవికా దీదీ గ్రూపుల్లోని మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీలు రద్దు చేస్తాం
రెండేళ్లపాటు వడ్డీలేని రుణాలు ఇస్తాం
ఇతర ప్రభుత్వ సంబంధిత పనులు నిర్వహిస్తున్న జీవికా గ్రూప్ మహిళలకు ప్రతి నెలా రూ.2,000 అలవెన్స్
రూ.5,00,000 వరకూ బీమా సౌకర్యం
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం.
ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం..
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తేజస్వి యాదవ్ ఇప్పటికే మరో కీలక వాగ్దానం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని అక్టోబర్ 9న ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే ఉద్యోగాల గ్యారెంటీకి సంబంధించిన కొత్త చట్టం తీసుకువస్తామన్నారు. 20 నెలల్లో రాష్ట్రమంతటికీ వర్తించేలా చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోంగం లేని ఒక్క ఇల్లు కూడా ఉండదని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 23 , 2025 | 09:20 AM