ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మా ట్రాక్ రికార్డును నమ్మే రికార్డు స్థాయి పోలింగ్.. ఎన్డీయే గెలుపు ఖాయమన్న మోదీ

ABN, Publish Date - Nov 07 , 2025 | 04:18 PM

నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.

PM Modi

ఔరంగాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. తనకు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఉన్న ట్రాక్ రికార్డు, తమ పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అఖండ విజయం సాధిస్తుందని ఔరంగబాద్‌లో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చినందుకు భారత ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు.

'మోదీ-నితీష్ ట్రాక్ రికార్డు ప్రజల ముందుంది. నేను ఏదైతే చెప్పానో అదే చేశాను. రామాలయం నిర్మిస్తామన్నాం. అది జరిగిందా లేదా? 370వ అధికరణ కుప్పకూలుతుందని చెప్పాను. అది సాకారమైందా లేదా?' అని మోదీ ప్రశ్నించారు. నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్జేడీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సైతం విశ్వసించడం లేదని అన్నారు. కాంగ్రెస్ బిహార్ అధ్యక్షుడిని ఆర్జేడీ అవమానించిందని చెప్పారు. గత 35-40 ఏళ్లుగా ఎప్పుడూ గెలవని సీట్లను మాత్రమే కాంగ్రెస్‌కు ఆర్జేడీ ఇచ్చిందన్నారు. పలుచోట్లు రెండు పార్టీలు ఒకరిపై మరొకరు పోటీ చేస్తున్నాయని, సొంత సహచరులను నమ్మని వారు ఎవరికైనా ఎలా మేలు చేస్తారని ప్రధాని ప్రశ్నించారు.

ఎన్డీయే మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించారని, రాష్ట్రంలో లక్షలాది రిక్రూట్‌మెంట్లు తాము జరపడమే ఇందుకు కారణమని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ట్రాక్ రికార్డు ఏమిటో ప్రజలకు బాగా తెలుసునని, భూములకు ఉద్యోగాలిచ్చారని, ఈరోజు వాళ్లు బెయిలుపై ఉన్నారని, వారిపై విచారణ కొనసాగుతూనే ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక ణెం, స్టాంపు విడుదల

బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 05:53 PM