ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: రిజల్ట్ డే.. 501 కిలోల లడ్డూలు సిద్ధం చేస్తున్న బీజేపీ శ్రేణులు

ABN, Publish Date - Nov 12 , 2025 | 08:28 PM

ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

BJP workers prepare laddoos

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనుండగా..పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకే పట్టం కట్టడంతో బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఫలితాల రోజు విజయోత్సవాల్లో స్వీట్లు పంచేందుకు పాట్నాలో 501 కిలోల లడ్డూలను ఆ పార్టీ కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ రోజు నాటికి అన్ని లడ్డూలు సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు.

'ఎన్డీయే ఘన విజయం సాధించనుంది. ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పాయి. ఇందుకోసం మేము 501 కిలోల లడ్డూలు తయారీకి ఆర్టర్ ఇచ్చాం. ఎన్డీయే గెలుపు కోసం ఓటేసిన వారందరికీ లడ్డూలు పంచుతాం. ఓటర్లు మరోసారి ఎన్డీయే కూటమికి, నితీష్‌కు జైకొట్టడం ఖాయం' అని పార్టీ కార్యకర్త కిషన్ కుమార్ సింగ్ తెలిపారు.

బిహార్‌లో ఈనెల 6,11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. రెండు దశల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయిన వెంటనే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అన్ని సర్వేలు ఎన్డీయే తిరిగి అధికారంలోకి రానుందని జోస్యం చెప్పాయి. అయితే ఈ సర్వేలన్నీ బీజేపీ ఆదేశాలతో వెలువడినవేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొట్టివేశారు. సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్ జరిగినప్పుడు 6.30కే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెలువడటం ఏమిటని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. మహాగఠ్‌బంధన్‌కు గతంలో కంటే మెరుగైన ఫలితాలు రావడంతో పాటు నవంబర్ 18న తమ ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 08:43 PM