ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maithili Thakur: గెలుపు దిశగా జానపద గాయని మైథిలీ ఠాకూర్

ABN, Publish Date - Nov 14 , 2025 | 12:49 PM

బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.

Maithili Thakur

బిహార్ అసెంబ్లీ(Bihar election 2025) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహాగఠ్ బంధన్ కు షాకిస్తూ అధికార ఎన్డీయే దూసుకెళ్తోంది. 190పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగఠ్ బంధన్ అభ్యర్థుల్లో పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. ప్రతిపక్ష కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీ(RJD) నేత తేజస్వి యాదవ్ ..రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. బీజేపీ అభ్యర్థి, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్(25).. ఈ ఎన్నికల్లో సత్తాచాటుంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ స్థానం(Alinagar constituency) నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెలువుడుతున్న బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ 28,104 ఓట్లు పోలవగా.. సమీప ప్రత్యర్థి, ఆర్జేడీ నేత బినోద్ మిశ్రా 21,311 ఓట్లు సాధించారు. దీంతో 6700పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో మైథిలీ ఠాకూర్ కొనసాగుతోంది. ఇక ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పార్టీ అభ్యర్థికి కేవలం 814 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఒకప్పుడు బలమైన అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీకి చెందిన బినోద్ మిశ్రా(BINOD MISHRA) తాజాగా ఎన్నికల్లో 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఈ స్థానంలో మొత్తం 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరికొన్ని రౌండ్లు పూర్తైతే కానీ ఎవరు విజేతలు అనేది స్పష్టత వస్తుంది. ఇక మైథిలీ ఠాకూర్ విషయానికి వస్తే.. గతంలో ఎన్నికల కమిషన్ బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా మైథిలీ నియమితులయ్యారు. బిహార్ సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందారు. బిహార్ జానపద సంగీతానికి చేసిన సేవలకుగానూ 2021లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సంగీత నాటక అకాడమీ సత్కరించింది. మైథిలీని ఎమ్మెల్యేగా చూడలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Tejashwi Yadav Trails: సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజ

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 01:42 PM