ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UGC NET June 2025: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసే క్రమంలో ఈ తప్పులు చేయోద్దు

ABN, Publish Date - Apr 16 , 2025 | 08:20 PM

గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసిన విద్యార్థులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా UGC NET జూన్ 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, పరీక్ష తేదీ ఎప్పుడనే తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

UGC NET June 2025

యూజీసీ నెట్ కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో NTA UGC NET జూన్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 16 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 7గా ఉంది. అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మరో రోజు అంటే మే 8 వరకు సమయం ఉంటుంది. UGC NET జూన్ 2025 పరీక్ష నిర్వహణకు తాత్కాలిక తేదీ జూన్ 21 నుంచి జూన్ 30 మధ్య ఉంటుందని ప్రకటించారు. https://ugcnet.nta.ac.in/www.nta.ac.in ని సందర్శించడం ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. NTA జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరీక్ష బాధ్యతను జాతీయ పరీక్షా సంస్థకు అప్పగించింది. నోటిఫికేషన్ ప్రకారం, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, నగరం, కేంద్రం గురించి సమాచారం అందిస్తారు.


UGC NET జూన్ 2025 ముఖ్యమైన తేదీలు

  • UGC NET జూన్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీ: ఏప్రిల్ 16 నుంచి మే 07 వరకు రాత్రి 11:59 వరకు

  • పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 8 రాత్రి 11:59 గంటల వరకు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో తప్పులను సరిదిద్దుకోవడానికి తేదీ: 09 మే నుంచి 10 మే 2025 వరకు

  • NTA వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి

  • UGC NET పరీక్ష ఎప్పుడు జరుగుతుంది: 21 జూన్ 2025 నుంచి 30 జూన్ 2025 మధ్య (ఇది తాత్కాలిక తేదీ)


ఎంత ఫీజు వసూలు

UGC NET జూన్ 2025 కోసం జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1150 రుసుము చెల్లించాలి. EWS కేటగిరీ జనరల్ అభ్యర్థులు, OBC అభ్యర్థులు రూ. 650 ఫీజు చెల్లించాలి. దీంతో పాటు, ST,SC, PWD, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఈ ఫీజును రూ. 325గా నిర్ణయించారు.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

  • అభ్యర్థులు UGC NET-2025 పరీక్షకు https://ugcnet.nta.ac.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను నింపితే అది తిరస్కరించబడుతుంది

  • అభ్యర్థులందరూ NTA వెబ్‌సైట్‌లో పేర్కొన్న సూచనలను ఖచ్చితంగా పాటించాలి. అలా చేయకపోతే అభ్యర్థి అనర్హుడు అవుతాడు

  • దరఖాస్తులో పేర్కొన్న ఇమెయిల్ ఐడి లేదా ఫోన్ నంబర్‌కు సమచారం పంపిస్తారు. కాబట్టి అది సరైనది ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, వారు తమ సమస్యను 011 – 40759000 / 011 – 69227700 నంబర్లకు లేదా ugcnet@nta.ac.in కు ఇమెయిల్ ద్వారా నివేదించవచ్చని NTA తెలిపింది.


ఇవి కూడా చదవండి:

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 11:59 AM