ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Study Medicine: అమెరికాలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారా? ఇవిగో..

ABN, Publish Date - Jul 27 , 2025 | 06:47 PM

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు భారత్ యువత క్యూ కడుతోంది. యూఎస్‌లో ఈ విద్యను అభ్యసించేందుకు యువత తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఆ దేశంలో టాప్ 10 యూనివర్సిటీలకు మంచి డిమాండ్ ఉంది.

నేటి యువత విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తుంది. ఆ క్రమంలో వివిధ దేశాలకు భారత యువత క్యూ కడుతోంది. ఆ క్రమంలో వైద్య విద్య కోసం ఆమెరికాకు వెళ్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం.. వైద్యరంగంలో ప్రపంచంలోనే అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. జాన్స్ హాప్కిన్స్, స్టాన్‌ఫోర్డ్, యేల్ యూనివర్సిటీలు టాప్ 10 జాబితాలో నిలిచాయి. ఈ విశ్వ విద్యాలయాలు అద్భుతమైన పరిశోధన, బోదన, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందాయి. అమెరికాలో వైద్య డిగ్రీ ఎండీ.. భారత్‌లోని ఎంబీబీఎస్‌కి సమానం.

ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. అందులో అమెరికన్ విశ్వవిద్యాలయాలు.. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా రాణిస్తున్నాయని స్పష్టం చేసింది.

పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ దృక్పథం, ఆదాయం, బోధన నాణ్యత, పరిశోధన వాతావరణం తదితర అంశాల ఆధారంగా సర్వే చేపట్టి.. ఈ జాబితాను విడుదల చేసింది.

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం.. ఆ దేశంలో అగ్రస్థానంలో.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. యూఎస్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కావాలని కలలు కనే విద్యార్థులు తొలి ఎంపిక ఈ విశ్వవిద్యాలయమని స్పష్టం చేస్తోంది.

హార్వర్డ్ తర్వాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన బోధన, పరిశోధనలకు ప్రసిద్ధి కాంచింది. వైద్యం, శస్త్ర చికిత్స, నర్సింగ్, ప్రజారోగ్యం తదితర కోర్సులు ఇక్కడ బోధిస్తారు. దీనితోపాటు స్టాన్‌ఫోర్డ్, యేల్ విశ్వవిద్యాలయాలు కూడా టాప్ 10 జాబితాలో ఉన్నాయి. అలాగే కాలిఫోర్నియా, బర్కిలీతోపాటు యూసీఎల్‌ఏ సైతం టాప్ 10 జాబితాలో ఉన్నాయి.

యూఎస్‌లో వైద్య విద్యకు టాప్ 10 సంస్థలు..

  • హార్వర్డ్ విశ్వవిద్యాలయం

  • జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం

  • స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం

  • పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ

  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లాస్ ఏంజిల్స్

  • కొలంబియా విశ్వవిద్యాలయం

  • వాషింగ్టన్ విశ్వవిద్యాలయం

  • డ్యూక్ విశ్వవిద్యాలయం

వీటికి అంత క్రేజ్ ఎందుకంటే..

ఈ విశ్వవిద్యాలయాల్లో విద్య స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పరిశోధన, ఆవిష్కరణలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వీటిలో చదువు పూర్తి చేసుకున్న వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగాలు, గౌరవ వేతనాలు, మంచి కేరీర్‌లను పొందుతారని చెబుతారు.

For More Educational News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 06:47 PM