ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

437 Jobs Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

ABN, Publish Date - Jun 11 , 2025 | 03:45 PM

కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు తుది గడువు జూన్ 26వ తేదీ.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లోని పలు విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్లు, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్ తదితర గ్రూప్ - బీ నాన్ గజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎస్ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్ - 2025 పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల యువతి, యువకులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీ జూన్ 26. ఈ పరీక్షలకు పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇంకా చెప్పాలంటే.. ఈ పోస్టులను బట్టి హిందీ, ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో హిందీ / ఇంగ్లీష్ సబ్జెక్ చదివి ఉండాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 నుంచి రూ. 1, 42, 000 జీతాన్ని చెల్లించనున్నారు.

ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సీబీటీ పరీక్షను ఆగస్టు 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాలు, అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల గరిష్ట వయో పరిమితి మేరకు సడలింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఈ పరీక్షా విధానం..

పేపర్ -1 ఆబ్జెక్టివ్ టైప్/ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇక పేపర్ -2 డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అందులో ట్రాన్స్‌లేషన్, ఎస్సే ఇలా మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 2 గంటల్లో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఈ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ..

ఈ పరీక్షకు ఆన్‌లైన దరఖాస్తు ప్రారంభ తేదీం జూన్ 5, 2025

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 25

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూన్ 27, 2025

కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1: ఆగస్ట్ 12, 2025

ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..

నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. త్వరలో కొత్త తేదీలు..

For Educational News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 03:45 PM