ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RRB Paramedical Recruitment 2025: ఇంటర్ పాసైన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..

ABN, Publish Date - Jun 23 , 2025 | 01:35 PM

భారత రైల్వేలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వే బోర్డు 403 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (RRB Paramedical Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, జీత భత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

RRB Paramedical Recruitment 2025

భారత రైల్వే 2025లో పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ (RRB Paramedical Recruitment 2025) ప్రక్రియకు సిద్ధమైంది. జూన్ 17, 2025 నాటికి రైల్వే బోర్డు వివిధ విభాగాల్లో 403 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణీకుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ ఉద్యోగులు పనిచేయనున్నారు. వీటిలో అత్యధిక సంఖ్యలో నర్సింగ్ సుపరింటెండెంట్ పోస్టులు (246) ఉన్నాయి. దీంతోపాటు 100 ఫార్మసిస్ట్ పోస్టులు కూడా కలవు. మిగతా వాటిలో ల్యాబ్ అసిస్టెంట్స్, ECG టెక్నీషియన్లు సహా పలు ఖాళీలు ఉన్నాయి.

పోస్టు పేరుతోపాటు ఖాళీల వివరాలు

  • డయాలిసిస్ టెక్నీషియన్ - 4

  • ECG టెక్నీషియన్ - 4

  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II - 12

  • నర్సింగ్ సుపరింటెండెంట్ - 246

  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) - 100

  • రేడియోగ్రాఫర్ X-రే టెక్నీషియన్ - 4

  • హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II - 33

అర్హతా ప్రమాణాలు

  • డైటిషియన్: బి.ఎస్‌ సైన్స్, పీజీ డిప్లొమా లేదా హోమ్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ

  • డెంటల్ హైజినిస్ట్: సైన్స్ డిగ్రీ లేదా డెంటల్ హైజినిస్ట్ కోర్సు (2 సంవత్సరాలు)

  • డయాలిసిస్ టెక్నీషియన్: బి.ఎస్‌ సైన్స్ + డిప్లొమా

  • ఫార్మసిస్ట్: 12వ తరగతి సైన్స్ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ

సెలక్షన్ ప్రక్రియ

  • RRB పారామెడికల్ ఉద్యోగాల కోసం ఎంపిక విధానం నాలుగు దశలలో జరుగుతుంది.

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): ఈ దశలో మొదట అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): CBTలో ఉత్తీర్ణమైన అభ్యర్థులు వారి విద్యా అర్హతలు, వయో పరిమితి సమర్పించాలి

  • మెడికల్ ఫిట్నెస్ టెస్ట్: అభ్యర్థులు తమ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్ధారించబడతాయి

  • ఫైనల్ మెరిట్ లిస్ట్: CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు

RRB పారా మెడికల్ ఉద్యోగులు చేయాల్సిన పనులు

  • RRB పారా మెడికల్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి

  • డైట్‌టిషియన్: పేషెంట్లను పరిశీలించి వారి ఆహార నియమాలను సూచించడం

  • స్టాఫ్ నర్స్: పేషెంట్ల శారీరక స్థితిని పరిశీలించి వారి వైద్య చికిత్సను అందించడం

  • డెంటల్ హైజినిస్ట్: పేషెంట్ల దంత హైజీన్ ను చెక్ చేయడం

  • డయాలిసిస్ టెక్నీషియన్: పేషెంట్లకు డయాలిసిస్ చికిత్స చేయడం

  • ఫార్మసిస్ట్ గ్రేడ్ III: పేషెంట్లకు ఔషధాలు ఇవ్వడం

RRB పారామెడికల్ సిబ్బంది జీతాలు 2025

  • RRB పారామెడికల్ ఉద్యోగాలకు చెల్లించే జీతం రూ.21,700 నుంచి రూ.44 ,900 మధ్య ఉంటుంది. ఇది ప్రతి పోస్టుకు సంబంధించిన జీతం వారి లెవల్ ప్రకారం మారుతుంది.

  • డైట్‌టిషియన్ / స్టాఫ్ నర్స్: రూ. 44,900

  • ఫార్మసిస్ట్ / రేడియోగ్రాఫర్: రూ. 29,200

  • ల్యాబ్ అసిస్టెంట్: రూ. 21,700

ఇవీ చదవండి:

జూలై 2025లో బ్యాంకు సెలవులు.. ఇదే పూర్తి లిస్ట్..

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్


మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 01:44 PM