ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LIC Recruitment 2025: LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం.

ABN, Publish Date - Aug 18 , 2025 | 12:27 PM

డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

LIC recruitment 2025

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల కోసం 841 ఖాళీలను ప్రకటించింది (LIC Recruitment 2025). ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు నెలకు రూ.లక్షా 20 వేలకుపైగా జీతం ఉంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి?

  • LIC ఈసారి మొత్తం 841 పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ ఖాళీలు మూడు కేటగిరీలుగా విభజించబడ్డాయి.

  • అసిస్టెంట్ ఇంజనీర్ (AE): 81 పోస్టులు

  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్: 410 పోస్టులు

  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జర్నలిస్ట్: 350 పోస్టులు

విద్యా అర్హతలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులకు అప్లై చేయాలంటే మీరు B.E./B.Tech డిగ్రీ కలిగి ఉండాలి (సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్). ఈ డిగ్రీ AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి పొందాలి.

AAO స్పెషలిస్ట్ & AAO జర్నలిస్ట్: ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా ఏ ఫీల్డ్‌లో గ్రాడ్యుయేట్ అయినా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి AE పోస్టులు, మిగతా వారందరికీ AAO పోస్టులు ఓపెన్.

వయస్సు పరిమితి

దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2025 ఆధారంగా లెక్కించబడుతుంది. కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30-32 సంవత్సరాలు (పోస్టును బట్టి మారవచ్చు). రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు (SC/ST/OBC/PWD) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. కాబట్టి, మీరు రిజర్వేషన్ కేటగిరీలో ఉంటే, అధికారిక నోటిఫికేషన్‌లో మీకు వర్తించే వయస్సు సడలింపు గురించి తెలుసుకోండి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

  • LIC AAO, AE ఎంపిక ప్రక్రియలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి

  • ప్రిలిమినరీ ఎగ్జామ్: ఈ పరీక్ష అక్టోబర్ 3, 2025న నిర్వహించబడుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, ఇందులో మీ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.

  • మెయిన్స్ ఎగ్జామ్: ప్రిలిమ్స్ క్లియర్ చేసినవారు నవంబర్ 8, 2025న మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది కొంచెం డీప్‌గా ఉంటుంది. మీ స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి.

  • ఈ రెండు దశల్లో సక్సెస్ అయితే మీరు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానానికి ఎంపిక అవుతారు. కాబట్టి ఇప్పుడే అప్లై చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మరి.

  • దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మీరు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.inలో రిజిస్టర్ చేసుకుని సెప్టెంబర్ 8, 2025లోపు అప్లై చేసువాలి. అప్లికేషన్ ఫీజు రూ. SC/ST/PwBD అభ్యర్థులకు రూ. 85, ఇతర అభ్యర్థులకు రూ. 700.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 12:27 PM