School Bags: ఆ స్కూలు బ్యాగు ధర ఎంతో తెలుస్తే.. మీరు అమ్మో అనాల్సిందే మరి..
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:18 PM
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది.
బ్యాగు... బాగు...
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది. జపాన్‌లో ‘రాండోసేరు’ అనే స్కూలు బ్యాగు ధర ఎంతో తెలుసా? అక్షరాలా 33 వేల రూపాయలు.
జపాన్‌లో ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం వాడే స్పెషల్ బ్యాగు ఇది. సైనికులు ఉపయోగించే బ్యాగుల నమూనాను తీసుకుని, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వీటిని తయారుచేశారట.
ఇది మల్టీపర్పస్ బ్యాగు. వరదలు వచ్చినప్పుడు ఈ బ్యాగు వేసుకుంటే నీళ్లలో మునిగిపోకుండా ఉంటారు. భూకంపం లాంటివి సంభవించినప్పుడు కూడా వీటిని తల మీద పెట్టుకుంటే బరువైనవి మీద పడినా కూడా గాయాలవ్వవు. బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులు ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు.
సాధారణ బ్యాగులా కాకుండా దీని బరువు పిల్లల భుజాలు, వీపు మీద పడకుండా తేలికగా ఉంటుంది. అందుకోసం 150 రకాల మెటీరియల్స్‌ను వాడారట. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా డిజైన్ చేయడం వల్ల ఈ బ్యాగు ఆరేళ్ల దాకా పాడవ్వ కుండా ఉంటుంది. 300 క్వాలిటీ చెక్స్ చేశాకే దీన్ని మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈ బ్యాగు అంత ఖరీదు మరి.
ఈ వార్తలు కూడా చదవండి.
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2025 | 01:18 PM