ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27 10 2025

ABN, Publish Date - Oct 27 , 2025 | 05:49 AM

దళిత కవితా సంపుటుల పరిచయం, పద్యాల పోటీల బహుమతి ప్రదానం, విద్యార్థులకు కవిత, కథ, నాటికల పోటీలు, అనువాదం, కవిత్వ ప్రక్రియల పోటీ...

దళిత కవితా సంపుటుల పరిచయం

అంబేద్కర్ విద్యార్థి సంఘం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆధ్వర్యంలో కేశవ కుమార్ రెండు కవితా సంపుటాలు ‘ఆదిమ పౌరుడు’, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూని రాగం’ పరిచయ సభ అక్టోబర్ 27 సాయంత్రం 5గం.లకు అంబేద్కర్ ఆడిటోరియం, హెచ్‌సీయూలో జరుగుతుంది. అధ్యక్షుడు ప్రొ.బి.ఈశ్వరరావు, ముఖ్య అతిథి గోరటి వెంకన్న. సతీష్ చందర్, పిల్లలమర్రి రాములు, కందుకూరి అంజయ్య, మెర్సీ మార్గరెట్, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొంటారు.

తాటిపెల్లి తిరుపతి

పద్యాల పోటీల బహుమతి ప్రదానం

తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి 13వ వార్షికోత్సవాన్ని నవంబర్ 2తేదీన పలమనేరు లోని సొంత కళామందిరంలో నిర్వహిస్తున్నాం. పద్యాల పోటీల్లో గెలుపొందిన 50 మంది పిల్లలకు బహుమతులతో పాటు 13 మందికి వార్షికోత్సవ పురస్కారాలు అందిస్తున్నాం. ముఖ్య అతిథులుగా గార్లపాటి దామోదర్ నాయుడు, ఆముదాల మురళి, దశరథ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

పి. తులసినాథం నాయుడు

విద్యార్థులకు కవిత, కథ, నాటికల పోటీలు

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీకోసం 25 పంక్తులు మించని పద్యం/ కవిత/ గేయం; ఏ4 సైజు లో 3 పుటలు మించని కథ; 6 పుటలు మించని నాటికలను స్వదస్తూరితో పేజీకి 20 పంక్తులకు మించకుండా– దేశభక్తి, దేశ సమగ్రత, తెలంగాణ వైశిష్ట్యం, పర్యావరణం పచ్చదనం లాంటి అంశాలపై– రాయాలి. రచనపైన ఏ సమాచారమూ ఉండరాదు. విద్యార్థి పేరు, తరగతి మొదలైన సమాచారమంతా పాఠశాల ప్రధానాచార్యులు ధ్రువీకరించే పత్రంలో మాత్రమే ఉండాలి (వారి ఫోన్‌ నంబర్‌తోసహా). రచనలను నవంబర్‌ 5 లోపు చిరునామా: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ 500004కు పంపాలి.

తెలంగాణ సాహిత్య అకాడమి

అనువాదం, కవిత్వ ప్రక్రియల పోటీ

మాధవరావు జ్ఞాపకార్థం తెలుగు అనువాద సాహిత్యం, పద్య కవిత్వం, హైకూలు, మినీకవిత, దీర్ఘకవితల పోటీ నిర్వహిస్తున్నాం. ఉత్తమ అనువాదానికి, ఉత్తమ కవితా ప్రక్రియకు చెరో రూ.5,116 బహుమతి ఉంటుంది. 2018 తర్వాత ముద్రితమైన 2 కాపీలను నవంబర్ 25లోపు పంపాల్సిన చిరునామా: నిర్వాహకులు, శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం, పాత బస్టాండు వద్ద, మెయిన్ రోడ్, పిఠాపురం – 533450. వివరాలకు: 94945 53425.

పీఠికాపుర సాహితీ కళావేదిక

Also Read:

ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

Updated Date - Oct 27 , 2025 | 05:49 AM