Share News

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:30 AM

టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు.

India T20 Squad: ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!
T20 Squad

క్రికెట్ న్యూస్: ఆస్ట్రేలియా టూర్ లో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కోల్పోయిన టీమిండియా..మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం కాన్‌బెర్రా వేదికగా ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు(Team India) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. ఆఖరి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సంగతి తెలిసిందే.


ఇక టీ20 సిరీస్‌లో(India T20 squad) సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు. టీ20 స్పెషలిస్ట్‌లు అభిషేక్ శర్మ(Abhishek Sharma), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, బుమ్రా (Jasprit Bumrah)రీఎంట్రీ ఇవ్వనున్నారు. తొలి టీ20లో బరిలోకి దిగే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశనే ఎదురయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనుందని సమాచారం.


అలానే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీని ఆడించనుంది. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ అయితే అతనికి అవకాశం దక్కనుంది. తొడ కండరాల గాయంతో అతను సిడ్నీలో జరిగిన వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. ఒకవేళ నితీష్ దూరమైతే అతని స్థానంలో రింకూ సింగ్‌ లేదా వాషింగ్టన్ సుందర్(Washington Sundar) బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి ఉండటంతో హర్షిత్ రాణా ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిడ్నీ వన్డేలో హర్షిత్ రాణా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్ డెప్త్‌కు ప్రాధాన్యత ఇస్తే వరుణ్ చక్రవర్తీ(Varun Chakravarthy) స్థానంలో కూడా వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా):

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి/రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ/కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్


ఇవి కూడా చదవండి..

Rohit Sharma Century Records: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 11:51 AM