Share News

Rohit Sharma Century Records: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:36 AM

సిడ్నీ వన్డేలో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌గా నిలిచిన రోహిత్ శర్మ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాం‍డ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. అతడు ఇప్పటివరకు సేనా(SENA) దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు.

Rohit Sharma Century Records: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ
Rohit Sharma Century Records

క్రికెట్ న్యూస్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా నిన్న(శనివారం) ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(121)(Rohit Sharma century) సెంచరీ చేశాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు .మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లి(74*)తో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌, సిరీస్‌గా నిలిచిన రోహిత్ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.


SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాం‍డ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ప్లేయర్ గా రోహిత్ఎ(Rohit Sharma records) నిలిచాడు. అతడు ఇప్పటివరకు సేనా(SENA) దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రి​కార్డు వెండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌(92)పేరిట ఉండేది. సిడ్నీ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదిన రోహిత్.. గేల్(Chris Gayle SENA record) ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అలానే 21వ శతాబ్ధంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా హిట్ మ్యాన్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(37ఏళ్ల, 132 రోజులు) పేరిట ఉండేది.


అలానే వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్ గా రోహిత్(cricket world records) నిలిచాడు. ఆస్ట్రేలియా(Australia)లో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్‌మ్యాన్‌ అధిగమించాడు. ఆసీస్ గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా హిట్ మ్యాన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా రోహిత్ శర్మ సిడ్నీ వన్డే(Sydney ODI)లో అనేక రికార్డులను బద్దలకొట్టాడు.



ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 09:36 AM