ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Annavaram Devenders The Last Ripening: కొంటపోక

ABN, Publish Date - Oct 27 , 2025 | 05:57 AM

తొమ్మిది పదులు దాటిన పండు ముదితల సంభాషణల సారం వినడమొక కవి సమయమే జీవన గీతికల చివరి చేరికల వలయాలు...

తొమ్మిది పదులు దాటిన పండు ముదితల

సంభాషణల సారం వినడమొక కవి సమయమే

జీవన గీతికల చివరి చేరికల వలయాలు

‘‘నన్నింక ఎందుకు ఉంచుతండో

మీది మొకాన కొంటపోక

జల్ది తీసుకపొమ్మని మొక్కుతన్న

భూమ్మీద ఇంక ఎందుకు ఉండుడు

నడువస్తలేదు, కూసోవస్తలేదు

లేశి నిలవడ శాత కాదు

ఆరు నెల్ల సంది అన్నీ మంచంలనే

నిద్ర పట్టది, పెయ్యి తిరుగుతది

ఆస్తులెన్ని ఉన్నా, అన్ని అవస్థలేనే

కొసాకరుకు ఎవీ అక్కరకు రావు

ఎవ్వలున్నా వెంట దుఃఖమే ఉన్నట్టు

ఎల్లిపోతేనే పాణానికి సుఖం

కండ్లు పురాగ మస్క మస్క

ఎవ్వలను ఏర్పాటు చెయ్యరాదు

మాటలతోనే జర ఎరుక పడుత

ముచ్చట పెట్టేటోళ్లు ఎవ్వలు రారు

కాళ్లు రెక్కలు గుంజుక పోవుడు

తలకాయ గిర గిర తింపుడు

దూప అయితది, తాగబుద్ధి కాదు

మెతుకు ముట్టక వారం దాటింది

గిన్ని ఏండ్లు బతుకుడు ఎందుకే

బతుకు యాష్టనే వస్తుంది చెల్లె!

గా దేవుడు కొంటపోతే బాగుండు

జీవునం ఉన్నట్టే గని లేనట్టే లెక్క

ఎండిపోయి బొక్కలు తెల్లగ తేలినయి

ఎల్లెం కొంటపోతేనే బాగుండు గదా!

తీసుకపోవాల్నని చూస్తున్నవ్వ’’

చెట్టు మీద బుర్ర పండిన పండు నేలరాలి

విత్తనమయ్యే తాదాత్మ్యతనే వృద్ధాప్యం

పరిపక్వత చెందడం దేహ జీవ సూత్రం.

అన్నవరం దేవేందర్

94407 63479

Also Read:

ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

Updated Date - Oct 27 , 2025 | 05:57 AM