ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charan Parimis Literary Journey: రాయటం మొదలుపెట్టాక చదివే పద్ధతి మారింది

ABN, Publish Date - Dec 29 , 2025 | 06:01 AM

Reading Habits Writing Craft and Creative Influences An Insight into Charan Parimis Literary Journey

చదువు ముచ్చట

రీసెంట్‌గా చదివి ఇష్టపడిన పుస్తకం?

గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ నవల ‘క్లాండెస్టెన్‌ ఇన్ చిలీ’కి తెలుగు అనువాదం ‘చీకటి పాట’ చదివాను. ఇది చిలీ ఫిల్మ్‌ మేకర్‌ మిగ్యుల్‌ లిట్టిన్‌పై రాసిన పుస్తకం. ఇందులో ఫిల్మ్‌మేకింగ్ ఏంగిల్, అలాగే నియంతృత్వం మీద సెటైర్, చారిత్రక నేపథ్యం... ఇవన్నీ నేను బాగా కనెక్ట్ అయిన అంశాలు. ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఉంది. ఒక రచయిత కానీ, ఫిలిం మేకర్ కానీ ఎలాంటి స్పిరిట్‌తో పనిచేయాలో చెప్పే నవల ఇది.

ఒకప్పటికీ ఇప్పటికీ మీరు చదివే పద్ధతి ఎలా మారింది?

ఇంతకుముందు సాహిత్యాన్ని తెలుసుకునే కోణంలో కొన్ని క్లాసిక్స్ ముందు పెట్టుకొని చదివేవాడ్ని. నేను రాయటం మొదలుపెట్టిన తర్వాత, చదివే పద్ధతి కూడా మారింది. నా సమకాలీకుల పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. కాంటెంపరరీ ఇష్యూస్ మీద, సొసైటీలో వచ్చిన మార్పుల మీద ఫోకస్ పెరిగి లిటరేచర్‌లో కూడా మన జీవితాన్ని రిసెంబుల్‌ చేసే విషయాలు వెతుక్కోవడం వల్ల కావచ్చు. రచనను ఆస్వాదిస్తూనే మనసులో అందులోని క్రాఫ్ట్‌ను స్టడీ చేయడానికి ప్రయత్నిస్తుంటాను.

ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే?

ఈ మధ్య నేను టైమ్‌ ట్రావెల్‌ మీద ఒక నవల రాశా. కథానాయకుడు కాలంలో వెనక్కి వెళ్ళి, తనకి ఇష్టమైన గాయకుడు ఎస్పీ బాలును కలుస్తాడు. మీ ప్రశ్నతో నాకు అదంతా గుర్తొస్తూంది. నాకు ఇష్టమైన వాళ్ళను దూరం నుంచి చూడడమే ఇష్టం. ఒకవేళ అవకాశం ఉంటే బుచ్చిబాబును కలిసి ‘మనసు లోకి తొంగి చూసే విద్య ఎలా అబ్బింది’ అని అడుగుతా. కథ రాయడానికి ఆయన వేసుకునే ప్రణాళికను దగ్గరుండి గమనిస్తా. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్‌ని కూడా కలిసి కొన్ని కథలు, నవలలు రాయమని రిక్వెస్ట్ చేస్తా.

కథల్లో నవలల్లో మిమ్మల్ని ఇరిటేట్ చేసిన పాత్ర?

రంగనాయకమ్మ నవల ‘జానకి విముక్తి’లో భర్త పాత్ర, పేరు శ్రీహరి అనుకుంటాను, చాలా ఇరిటేట్ చేస్తుంది. రచయిత టోన్ కూడా అదే ఇరిటేషన్‌తో సాగుతుంది. ‘చంఘిజ్‌ ఖాన్’ నవలలో అతని సోదరుడి పాత్ర కొంచెం ఇరిటేట్ చేస్తుంది. అంటే అది రచనలో లోపం కాదు. రచయిత అంత అద్భుతంగా పాత్రను రాశాడు. ఆ పాత్ర భావాలు మంచివే అయినా వాస్తవికంగా ఆలోచించకపోవడం వల్ల జరిగే నష్టాలకు కారణమై చిరాకు పెడతుంది. చాలా స్త్రీవాద రచనల్లో పురుషుల పాత్రలు ఇరిటేటింగ్‌గా ఉంటాయి. కొన్నిసార్లు అవసరానికి మించి.

మీకు బాగా నచ్చే ఇలస్ట్రేటర్స్?

నాకు అన్వర్ గారి ఇలాస్ట్రేషన్స్ అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. నేను ఇల్లస్ట్రేటర్‌గా కెరీర్ ఎంచుకోవడంలో ఆయన బొమ్మల పాత్ర కూడా ఉంది. నిజానికి చిత్రకారుడికి వీళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చలేదు అనేది ఉండదు. అనేకమంది నుంచి ఏదో ఒక కోణంలో స్ఫూర్తి పొందుతాం. కాబట్టి లిస్టు చాలా పెద్దదే. కామిక్ ఇలస్ట్రేటర్స్ అభిషేక్ సింగ్, రాజేష్ నాగులకొండ, కార్టూనిస్టులు మోహన్, శంకర్ ఇలా చాలామంది ఉన్నారు.

రచనలో మీకు ఉపయోగపడిన సలహా?

ఒకసారి ‘రైటర్స్ మీట్’లో కత్తి మహేష్ ఒక మాట అన్నారు: ‘‘మీరు రాసిందాని మీద విమర్శలు రాకపోతే, దాన్ని ఎవరో ఖండించి దాడి చేయకపోతే,’’ ఇక రాయడం ఎందుకు అని. మన దృక్పథాన్ని నిర్మొహమాటంగా చెప్పాలని, రాయాలనుకున్నది భయపడకుండా రాయాలని సూచన ఆ మాటల్లో ఉంది. నా గొంతుని బలంగా వినిపించడానికి పనికొచ్చిన సూచన అది.

చరణ్‌ పరిమి

(చరణ్‌ పరిమి కథకుడు, చిత్రకారుడు.

2022లో ‘కేర్ ఆఫ్ బావర్చి’ కథల పుస్తకం, 2024లో ‘బొంబాయి పొట్టేలు’ కథల పుస్తకం, ఈ ఏడాది ‘ప్రేమమ్‌.. కాలయానమ్‌ 1995’ నవల వచ్చాయి.)

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

Updated Date - Dec 29 , 2025 | 06:01 AM