Telangana Rising Global Summit: కార్మికులు రైతులతో కలిసి సాగాలి
ABN, Publish Date - Dec 12 , 2025 | 03:35 AM
ప్రపంచ దేశాల పెట్టుబడుదారులను ఆకర్షించేట్టుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే...
ప్రపంచ దేశాల పెట్టుబడుదారులను ఆకర్షించేట్టుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కంపెనీల ఆదాయం పెరుగుతుందన్న ఆలోచనను బడా పారిశ్రామికవేతల మదిలో బీజంగా నాటగలిగింది. దాదాపు రూ.6లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేవిధంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక వేదిక కావడం మంచి పరిణామం. ఇప్పటికే పారిశ్రామికంగా, ఐటీ రంగాలలో అంతులేని అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, 2047 సంవత్సరానికి సాధించాల్సిన లక్షలతో విజన్ డాక్యుమెంట్‌ను ఈ సమ్మిట్‌లో ఆవిష్కరించారు.
గతాన్ని నెమరువేసుకొని, వర్తమానాన్ని అధ్యయనం చేసి, భవిష్యత్ వైపుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు ఆయన విజన్ డాక్యుమెంట్ తెలుపుతున్నది. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో కొమురం భీమ్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి కీలకాంశాలైన భూమి, భుక్తి, విముక్తులను నెమరువేసుకొని తెలంగాణ సమగ్రాభివృద్ధి వైపు ఆయన అడుగులు వడివడిగా వేస్తున్నారు. 2047 సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని విజన్‌తో సమ్మిట్‌ను నిర్వహించినా ఐదేళ్ళల్లోనే పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నట్లు స్పష్టంగా కనపడుతున్నది. ఐటీ, ఏఐ, టూరిజం, సినీ పరిశ్రమ, ఫార్మా రంగాల్లో అధిక పెట్టుబడులు రావడం వలన సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. నాణ్యమైన వైద్యం, విద్యను పేదలకు అందించాలనే దృఢ సంకల్పంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుము బిగిస్తున్నది. చేసే ప్రతి ఆలోచనా రైతాంగం, పరిశ్రమలను కలుపుకుంటూ చేయటం శుభపరిణామం. గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయం ముఖ్యం. ఇటూ వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలను సమన్వయం చేసుకోవాలి. పరిశ్రమల పేరుతో వేల ఎకరాల భూములను అన్యాక్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించాలి. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం. అలాగే విద్యాభివృద్ధిని కూడా ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావించడం దానికి ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతను సూచిస్తుంది. అయితే ఆశిస్తున్నవన్నీ ఆచరణలోకి వస్తేనే ప్రయోజనం. అందుకు నిబద్ధత కూడిన నాయకత్వం అవసరం. అలాంటి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందిస్తారని భావిస్తున్నాను.
చాడ వెంకట్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News
Updated Date - Dec 12 , 2025 | 03:35 AM