Bhavani Deeksha: మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:19 PM
ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష గురువారం నుంచి ప్రారంభకానుంది. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారని అధికారలు అంచనా వేస్తున్నారు.
విజయవాడ, డిసెంబర్ 10: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీలు గురువారం నుంచి దీక్ష విరమించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తి చేశారు. గురువారం నుంచి అంటే.. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. ఏటేటా ఈ భవానీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ భవానీ దీక్షలకు దాదాపు 7 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇరుముడి సమర్పించేందుకు మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్‌తోపాటు 19 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు.
లక్షలాదిగా తరలి వచ్చే భవానీలకు మంచి నీరు అందజేయనున్నారు. అలాగే భవానీ భక్తులకు ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. 950 మంది క్షురకులు, 4 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు 370 సీసీ టీవీ కెమెరాలతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక దేవస్థానంలో అన్ని ఆర్జిత సేవలు డిసెంబర్ 11 నుండి 16వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గం వివరాలను అందించేందుకు 2025 మొబైల్ యాప్‌ను ఇప్పటికే రూపొందించి.. భవానీలకు అందుబాటులోకి తెచ్చారు.
9 కిలోమీటర్ల మేర సాగనున్న గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తుడికి పెద్దపీట వేసేలా దేవాలయంలో ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భవానీ మాల తీసుకున్న భక్తులు 41 రోజుల పాటు నియమ నిష్టలతో ఉంటారు. భవాని దీక్ష విమరణ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దేవాలయం ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం
Read Latest AP News and National News