Simple Trick to Separate Seeds from Custard Apple: సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:45 PM
సీతాఫలానికి సంబంధించి.. మాస్టర్ చెఫ్ నెహా దీపక్ షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరోగ్యానికి ఎన్ని పండ్లు ఉన్నా.. అత్యధిక పోషకాలు ఉన్నవి మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో సీతాఫలం ఒకటి. వీటిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం తదితర ఖనిజాలు అందుతాయి. అంతేకాదు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని సైతం అందుతుంది. తద్వారా వ్యాధులను నివారిస్తుంది. అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ సీతాఫలం తింటున్నప్పుడు మధ్యలో గింజలు అడ్డు వస్తాయి. దీంతో ఒకింత చిరాకు అనిపిస్తోంది. అయినా అలాగే సీతాఫలాలను కాయ మీద కాయను లాగించేస్తూ ఉంటారు.
కానీ సీతాఫలానికి సంబంధించి.. మాస్టర్ చెఫ్ నెహా దీపక్ షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతాఫలాన్ని రెండు భాగాలుగా కోసింది. ఒక చెంచాతో సీతాఫలంలోని ఒక భాగాన్ని ఫుడ్ చాపర్‌లో వేసింది. అలాగే మరో భాగాన్ని సైతం అందులో వేసింది. అనంతరం ఫుడ్ ఛాపర్ మూత పెట్టి.. కొన్ని సెకన్ల పాట్లు దీనిపై ఉంచిన తాడును పలుమార్లు లాగింది. అనంతరం ఫుడ్ ఛాపర్ మూత తీయగానే.. అందులో విత్తనాలు, గుజ్జు వేర్వేరు అయిపోయాయి. స్పూన్‌తో గింజలను వేరు చేసి.. పేస్ట్‌లాగా మారిన సీతాఫలం గుజ్జును స్పూన్‌తో తినడమే తరువాయి.
ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ సింపుల్ చిట్కాను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా బాగుదంటూ వ్యాఖ్యానించారు. మరొకరు.. సీతాఫల్ నుంచి విత్తనాలను తొలగించడానికి ఇది అద్భుతమైన ట్రిక్ అని అభివర్ణించారు. దీనిని తమతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. మేడం మీకు ఒక సింపుల్ చిట్కా చెబుతానంటూ.. ఒక వైర్ మెష్ కాడ ఉన్న జాలీని తీసుకుని.. అందులో సీతాఫలం గుజ్జును వేసి.. ఒక చెంచాతో.. గట్టిగా నొక్కితే గుజ్జు కింద ఉన్న పాత్రలో పడిపోతుంది. జాలీలో గింజలు ఉండిపోతాయని వివరించారు. దయచేసి దీన్ని కూడా ప్రయత్నించడంటూ నేహకు సూచించాడు.