Non Teaching Duties: బోధనేతర పనులతో విద్యకు నష్టం
ABN, Publish Date - Dec 20 , 2025 | 05:53 AM
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు సమర్థవంతమైన వృత్తి శిక్షణ అందిస్తూ, భావి పౌరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ నేపథ్యంలో...
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు సమర్థవంతమైన వృత్తి శిక్షణ అందిస్తూ, భావి పౌరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మాస్ కమ్యూనికేషన్ విభాగం, యునిసెఫ్ సహకారంతో నిర్వహించిన అధ్యయనం కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు ఆరు గంటలు బోధనకు కేటాయించాల్సిన చోట క్షేత్రస్థాయిలో సగం సమయం లేదా అంతకంటే తక్కువగానే పాఠాలు చెప్పగలుగుతున్నామని ఉపాధ్యాయులు వెల్లడించారు. బోధన సమయంలో ఫోన్ కాల్స్, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, హాజరు వివరాలు వంటి కారణాలతో ఏకాగ్రత కోల్పోతున్నామని వారు వాపోయారు. నేడు ఉపాధ్యాయులు గురువులుగా కాకుండా అనేక బోధనేతర పనుల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఫలితంగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి విలువ తగ్గుతోంది. ప్రభుత్వాలు తక్షణమే బోధనేతర పనులను పరిమితం చేసి, అవసరమైనచోట ప్రత్యేక సిబ్బందిని నియమించి ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకు కేటాయించాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తాయి.
మేకిరి దామోదర్, వరంగల్
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 05:53 AM