ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu language: అక్షరమాలలో కొత్త అక్షరాన్ని చేర్చాలి

ABN, Publish Date - Dec 20 , 2025 | 05:56 AM

తెలుగు భాషలో సంస్కృత పదాలతోపాటు అనేక ఇతర భాషా పదాలు చేరి, ప్రస్తుతం తెలుగు పదాలుగానే చలామణీ అవుతున్నాయి. ఉదాహరణకు: అసలు, ఆఖరు, జిల్లా, నకలు, తహశీల్దారు...

తెలుగు భాషలో సంస్కృత పదాలతోపాటు అనేక ఇతర భాషా పదాలు చేరి, ప్రస్తుతం తెలుగు పదాలుగానే చలామణీ అవుతున్నాయి. ఉదాహరణకు: అసలు, ఆఖరు, జిల్లా, నకలు, తహశీల్దారు... మొదలైన పదాలు ఏ ఇబ్బంది లేకుండా పలకడం, రాయడం మన తెలుగులోని సౌలభ్యంతో సాధ్యపడుతున్నది. కానీ ఆంగ్ల పదాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి ఉచ్చారణలో చాలా వరకూ ‘య’కారాన్ని కలిపి పలకవలసివస్తున్నది. ఉదాహరణకు: AN–యాన్‌, ACTION–యాక్షన్‌, CAT– క్యాట్‌, FAN–ఫ్యాన్‌, BANK–బ్యాంక్‌ వంటి రోజువారీగా ఉపయోగించే పదాలు అనేకం. ఆయా పదాల్లో ‘య’ చేర్చవలసిన అవసరం లేకుండా మన తెలుగు అక్షరమాలలో ఒక కొత్త అక్షరాన్ని చేర్చుకుంటే సరిపోతుంది.

ఇందుకోసం ముందుగా అచ్చుల్లో మనం అ, ఆ తర్వాత మరో ‘ఆ’ను చేర్చుకోవాలి. తద్వారా మన అచ్చులు 16కు బదులు 17 అవుతాయి. గుణింతాల్లోనూ తలకట్టు, దీర్ఘం తర్వాత మరో గుణింతపు గుర్తును(దీన్ని ‘ఆత్వము’ అని పిలుచుకోవచ్చు) చేర్చుకోవాలి. దీనివల్ల ఆయా పదాలను రాసేటప్పుడు, పలికేటప్పుడు సులభంగా ఉంటుంది. ఈ అక్షరం ‘ఆనిమల్‌–యానిమల్‌, బ్యాంక్‌–బేంక్‌, క్యాట్‌–కేట్‌, బ్యాట్‌–బేట్‌...’ పదాల ఉచ్చారణకు మధ్యస్థంగా ఉండి, ఆంగ్లంలో వలే ఉచ్చరించడానికి, తెలుగులో స్పష్టతతో రాయడానికి ఉపకరిస్తుంది. ఈ అక్షరాన్ని తెలుగు అక్షరమాలలో చేర్చే విషయమై తెలుగు భాషాభిమానులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రభుత్వం ఆలోచన చేయాలి.

మేడికొండూరు రఘురామ్‌శర్మ, విజయవాడ

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 05:56 AM