ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AI And Language Development: ఏఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా

ABN, Publish Date - Nov 21 , 2025 | 01:06 AM

ఏఐ అనేక సంచలనాలను సృష్టిస్తోంది. గణిత సమీకరణాలను పరిష్కరిస్తోంది. వ్యాసాలు రచిస్తోంది. సంగీత బాణీలు కడుతోంది. ట్యూటరుగా, అనువాదకునిగా... ఇలా ఎన్నో చేస్తున్నది....

ఏఐ అనేక సంచలనాలను సృష్టిస్తోంది. గణిత సమీకరణాలను పరిష్కరిస్తోంది. వ్యాసాలు రచిస్తోంది. సంగీత బాణీలు కడుతోంది. ట్యూటరుగా, అనువాదకునిగా... ఇలా ఎన్నో చేస్తున్నది. అనువాద ప్రక్రియను టెక్నాలజీ చాలా సులువు చేసింది. ఒక భాషలోని ఉత్తరాన్నో, వ్యాసాన్నో తప్పులు లేకుండా కేవలం క్షణాల్లోనే మరో భాషలోకి ఏఐ అనువదిస్తుంది. విషయం కచ్చితంగానే అనిపించించా, పేలవంగా ఉంటుంది. అనువాదం అంటే ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా మాత్రమే కాదు, విషయంలోకి పరకాయ ప్రవేశం చేసి అందించడం.

అందుకే భాష భిన్నమైనదని భాషావేత్తలు చెబుతారు. మాటలో, నవ్వులో, స్వరంలో అనేక భావాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎదుటివారికి మన ఆలోచనలు చెప్పడంలో తడబడతాం. ఆ తప్పులను జాగ్రత్తగా దిద్దుకుంటాం. ఇవన్నీ భాష నేర్చుకోవడంలో మెళకువలే. ఇవి మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఒకరితో ఒకరిని కలుపుతాయి. ఏ యాప్‌లు, చాట్‌బాట్‌లు మనకు ఈ సజీవ శిక్షణ అందించగలవు? సజీవ భాషలు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. యాస, మర్యాదపూర్వక సంభాషణా స్వరాలు మెల్లగా అనుభవంతో మారుతాయి. యంత్రం వీటిని నమోదు చేయగలదు. కానీ అదేమీ మనిషి కాదు కదా! వినడం, అర్థం చేసుకోవడం, తగిన విధంగా ప్రతిస్పందించడం, నిరంతర తర్ఫీజు... ఇదే భాషా ప్రావీణ్యతకు నిజమైన సాధనా మార్గం.

వి. వరదరాజు, శ్రీకాకుళం

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 01:06 AM