Share News

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:45 PM

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, నవంబర్ 20: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి.. రాజ్ భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:15 గంటలకు ఆమె తిరిగి రాజ్ భవన్‌కు చేరుకుంటారు.


రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ముర్ము బస చేయనున్నారు. 22వ తేదీ అంటే..శనివారం ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


ఈ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బుధవారం అంటే నవంబర్ 19వ తేదీన పుట్టపర్తిలో జరిగిన బాబా జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 05:47 PM