ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CCTV Cameras: అలంకారప్రాయం ఆ నిఘా నేత్రాలు

ABN, Publish Date - Oct 28 , 2025 | 12:23 AM

వ్యక్తిగతంగా కంటే సమాజపరంగా సీసీ కెమెరాల అవసరం పెరిగింది. కర్మాగారాల్లో, అత్యంత క్లిష్టమైన నిర్మాణాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఎంతో సహాయకారిగా ఉంది...

వ్యక్తిగతంగా కంటే సమాజపరంగా సీసీ కెమెరాల అవసరం పెరిగింది. కర్మాగారాల్లో, అత్యంత క్లిష్టమైన నిర్మాణాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఎంతో సహాయకారిగా ఉంది. ప్రధానమైన కూడళ్ళలో, హైవే రహదారుల్లో సీసీ కెమెరాల వల్ల ప్రమాదాలకు గల కారణాలతో పాటు నిందితుల/నేరస్తుల గుర్తింపునకు ఇవి కీలక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాత్రం అలంకారప్రాయంగా మారాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పల్నాడు జిల్లాలో ఒక కేసు విషయమై నిందితుణ్ణి సీసీ కెమెరాలు పనిచేస్తున్న స్టేషన్‌లోనే విచారించమని ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం 2020 డిసెంబర్‌లో సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ సహా దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యమని ఇచ్చిన ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.

హైవేలపై, షాపింగ్ మాల్స్‌లో నేరాల విషయంలో సీసీ ఫుటేజ్‌ని ప్రధాన సాక్ష్యంగా చూపుతున్న పోలీస్ యంత్రాంగం, తమ స్టేషన్లలో ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించడం చాలా విడ్డూరం. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, లేదా అది బయటకు ఇచ్చేది కాదని, లేదా రికార్డు మా వద్ద ఉండదని డీజీపీ ఆఫీసులో పొందమని చెబుతున్నారు. ఒక్కోసారి విచిత్రంగా సీసీ కెమెరాలు పోలీసుల, స్టేషన్ల భద్రత కోసం పెట్టామని, ప్రజలకు సమాచారం ఇవ్వడానికి కాదని వింత సమాధానం ఇస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిని, లేదా అనుమానితులను గంటల తరబడి స్టేషన్‌లో ఉంచడం, రోజూ స్టేషన్‌కు రమ్మని వేధించడాన్ని ఆపాలంటే, ప్రతి పోలీస్‌స్టేషన్, సీఐ, డీఎస్పీ కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, అవి సక్రమంగా పనిచేసేలా చూడాలి. వాటిని డీజీపీ ఆఫీస్‌తో అనుసంధానం చేసి, ఆ రికార్డు కనీసం సంవత్సరం పాటు ఉంచేలా చూడాలి. ఆర్టీఐ చట్టం క్రింద ప్రజలు కోరినప్పుడు దానిని ఇవ్వగలిగితే, ఖచ్చితంగా పోలీసులు హింసకు, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడకుండా ఉంటారు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకోవడంతో సరిపెట్టకుండా నిజమైన స్ఫూర్తితో పనిచేసినప్పుడే ప్రజల ప్రాథమిక హక్కును మన్నించడం అవుతుంది.

మారిశెట్టి జితేంద్ర

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:23 AM