బీసీ వాదం ఇప్పుడు వీస్తున్న గాలి
ABN, Publish Date - May 16 , 2025 | 06:17 AM
అధికార పార్టీ సామాజిక కులగణన నిర్వహించిన తర్వాత ఎవరి శాతం ఎంతో తెలిసిపోయింది. ఆయా కులాలకు ఎవరి వాటా ఎంతో అవగతం అయింది. ఈ గాలి త్వరలో రాజకీయ తుఫానుగా మారే సంకేతాలను ఇస్తున్నది. వెనుకబడిన కులాలకు ఒక ఆశాకిరణంలా కనపడుతున్నది. ఇప్పటిదాకా...
అధికార పార్టీ సామాజిక కులగణన నిర్వహించిన తర్వాత ఎవరి శాతం ఎంతో తెలిసిపోయింది. ఆయా కులాలకు ఎవరి వాటా ఎంతో అవగతం అయింది. ఈ గాలి త్వరలో రాజకీయ తుఫానుగా మారే సంకేతాలను ఇస్తున్నది. వెనుకబడిన కులాలకు ఒక ఆశాకిరణంలా కనపడుతున్నది. ఇప్పటిదాకా ‘బడితె ఉన్నోడిదే బర్రె’ అన్నట్టు అన్ని పార్టీలు తమ తమ కులాల ప్రాతిపదికన టికెట్లు ఇచ్చాయి. పైకి సామాజిక సమతూకం అంటూనే తీరా చూస్తే అధికార వర్గానికి అగ్ర తాంబూలం ఇచ్చాయి. అంతవరకు చెప్పిన మాటలన్నీ ఎన్నికల సమయానికి మర్చిపోయి బీసీలకు మొండి చేయి చూపించాయి. ఈ పరిస్థితిలో మంచికో చెడ్డకో, ఇష్టం ఉన్నా లేకున్నా, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణలో కులగణనకు శ్రీకారం చుట్టి పూర్తి చేసింది. ఈ చర్య క్రమంగా అన్ని రాజకీయ పార్టీలలో బహుజనులను ఏకం చేసే విధంగా సామాజిక విప్లవాత్మక మార్పుగా పరిణమించనున్నది. ఇటీవల దేశంలో ఏర్పడిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఆయా పార్టీలు తమ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రాహుల్‌గాంధీ దేశమంతా చేసిన పాదయాత్ర సామాజిక కులగణనను రాజకీయ పార్టీల ఎజెండా మీదికి బలవంతంగానైనా తెచ్చింది. దీని ప్రభావం గత ఏడాది పార్లమెంటు ఎన్నికల ఫలితాలపైన కనపడింది. అలాగే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడి వాక్చాతుర్యంపై, ఇచ్చిన వాగ్దానాలపై విశ్వాసంతో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్ తన హామీలలో ప్రధాన భాగమైన సామాజిక కులగణనను చేపట్టి పూర్తి చేసింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించింది.
దేశంలోనే ఎస్సీ వర్గీకరణను చట్టం ద్వారా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఖ్యాతిని ఆర్జించింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అధికారికంగా ఇవ్వడానికి సంకల్పించింది. ఈ విధంగా భవిష్యత్తులో జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్యమ రూపు దాల్చడానికి రోడ్డు క్లియర్ చేసింది. ఇన్నాళ్ళూ నివురుగప్పిన నిప్పులా ఉన్న వెనుకబడిన వర్గాలు త్వరలో తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ముందెన్నడూ లేనంత ఒత్తిడి పెంచనున్నాయి.
జూకంటి జగన్నాథం
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News
Updated Date - May 16 , 2025 | 06:17 AM