Sri Paramahansa Yogananda: కృష్ణుడు ఎక్కడుంటే.. అక్కడే విజయం !
ABN, Publish Date - Aug 15 , 2025 | 08:45 PM
లోక కల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు 21 అవతారాలను ధరించాడు. అందులో పరిపూర్ణమైన అవతారం ఒకే ఒక్క శ్రీకృష్ణావతారం.‘కృష్ణస్తు భగవాన్ స్వయం’.. అని శ్రీమద్భాగవతం 1.3.28లో శ్రీకృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. ఆ భగవంతుడి లీలా విశేషాలను మళ్లీ మళ్లీ తలచుకుని... ఆ ఆనంద మకరందాన్ని తనివితీరా జుర్రుకోవడమే మన అదృష్టం.
లోక కళ్యాణం కోసం శ్రీహరి 21 అవతారాలను ధరించాడు. అందులో పరిపూర్ణమైన అవతారం ఒకే ఒక్క శ్రీకృష్ణావతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’.. అని శ్రీమద్భాగవతం 1.3.28 లో శ్రీకృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. ఆ భగవంతుడి లీలా విశేషాలను మళ్లీ మళ్లీ తలచుకుని.. ఆ ఆనంద మకరందాన్ని తనివితీరా జుర్రుకోవడమే మన వంతు. అదే కృష్ణాష్టమి పర్వదినం. ఈ భువిపై శ్రీకృష్ణ భగవానుడి కారణ జన్మను ఎన్నిసార్లు కథలు కథలుగా చెప్పుకున్నా.. విన్నా భక్తుడి హృదయం పరవశిస్తూనే ఉంటుంది. మన జీవితాలను, సమస్త కర్మలను దేవదేవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు పునరంకితం చేయమని కృష్ణాష్టమి పర్వదినం మనకు గుర్తుచేస్తుంది. ‘నన్ను నమ్ము.. నా మార్గాన్ని అనుసరించి.. ధన్యుడివికా.. నువ్వు నాకు ఇష్టమైనవాడివి.. నీకు నేను మాట ఇస్తున్నాను.. నువ్వు నన్నే చేరుకుంటావు!’ అని జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు తన భక్తుడైన అర్జునుడికి చెబుతున్నట్టుగా మనందరికీ తెలియజేశాడు.
జన్మాష్టమి.. నిజమైన గొప్పదనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు గొప్ప అవతారం.. శ్రీకృష్ణ భగవానుడి జీవితం ప్రాముఖ్యత, ప్రతి మనిషీ.. తన జీవితాన్ని, కర్మఫలాలను దేవుడికి మాత్రమే అంకితం చేయవలసిన అవసరాన్ని మనందరికీ చెబుతుంది.
ప్రపంచ ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ శ్రీ పరమహంస యోగానంద, భగవద్గీతపై ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ అనే రెండు సంపుటాల గ్రంథాన్ని రచించారు. ఈ లోతైన ఆధ్యాత్మిక పుస్తుక పరిచయంలో యోగానంద గారు.. ‘భగవంతుని కోసం జరిగే అన్వేషణలో భక్తుడు, సాధకుడు ఎక్కడ ఉన్నప్పటికీ, వారి ప్రయాణంలో ఆ భాగంపై భగవద్గీత తన కాంతిని ప్రసరింపచేస్తుంది.’
యోగానంద గారు చెప్పిన గీత వ్యాఖ్యానంలో భగవంతుడి అంతర్గత సందేశాన్ని మరింత విశదీకరిస్తూ: కురుక్షేత్ర యుద్ధం.. యుద్ధానికి ముందు అర్జునుడి నైరాశ్యం.. ఇందులో నిజమైన అంతరార్ధం ఏమంటే, ప్రతి మనిషీ తన కోరికలను, అలవాట్లను వదలుకోవడానికి చూపే అయిష్టతను, అంతిమంగా ఆత్మ విముక్తి కోసం జరిగే ధర్మయుద్ధంలో ముందుగా ఈ అయిష్టతను జయించాలి.
భగవానుడైన శ్రీ కృష్ణుడ్ని మహా యోధుడైన అర్జుడు వేడుకుంటున్నాడు.. ‘నా ఆంతరంగిక స్వభావాన్ని.. బలహీనమైన జాలి ఆవరించడం వల్ల, నా మనస్సు కర్తవ్యం గురించి అయోమయంలో పడింది. నేను అనుసరించవలసిన అత్యుత్తమ మార్గమేదో నాకు తెలియజేయమని వేడుకుంటున్నాను. నేను నీ శిష్యుడ్ని. నీ శరణాగతిలో ఉన్న నాకు ఉపదేశించు.’
మానవాళికి అత్యున్నత ఆధ్యాత్మిక విజ్ఞానమైన ‘క్రియాయోగం’ గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో రెండుసార్లు ప్రస్తావించాడు. క్రియాయోగం పరమహంస యోగానంద గారి బోధనల సారభూతము. పరమహంస యోగానందులు తమ గురువు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి వద్ద శిక్షణ పొందారు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి యోగావతార్ లాహిరీ మహాశయుల శిష్యులు, శ్రీ లాహిరీ మహాశయులు శ్రీ మహావతార్ బాబాజీ శిష్యులు.
పరమహంస యోగానందగారిచే స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), ముద్రిత, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ మహాగురువుల బోధనలను ప్రచారం చేస్తుంది. వై.ఎస్.ఎస్. యొక్క ‘జీవించడం ఎలా’ బోధనలు ఈ బృహత్కార్యంలో ఒక ముఖ్యమైన భాగం.
‘క్రియాయోగం’ అనే శాస్త్రీయ మార్గాన్ని అనుసరించడం ద్వారా, ఏ కాలానికి, జాతీయతకు, నేపథ్యానికి చెందిన సత్యాన్వేషకులైనా ఆధ్యాత్మిక విముక్తి కోసం కృషి చేసి, అంతిమంగా దేవునితో ఐక్యత పొందవచ్చు. అందువల్ల, భగవంతునితో ఏకత్వం కోసం మనం పరితపించాలని, మన జీవిత ప్రయాణాన్ని ఆ లక్ష్యం వైపు నడిపించాలని మనకు దృఢంగా గుర్తు చెయ్యడమే జన్మాష్టమి యొక్క నిజమైన ప్రాముఖ్యత.
మరింత సమాచారం కోసం: yssofindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మరింత సమాచారం కోసం: yssofindia.org
మరింత ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 15 , 2025 | 09:24 PM