ఆ రాశి వారు ఈ వారం తలపెట్టిన కార్యం సఫలమవుతుంది..
ABN, Publish Date - Dec 14 , 2025 | 10:46 AM
ఆ రాశి వారు ఈ వారం తలపెట్టిన కార్యం సఫలమవుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. కార్యసాధనకు మరింత కష్టపడాలని, పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయని సూచిస్తున్నారు.
అనుగ్రహం
14 - 20 డిసెంబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
సంకల్పదీక్షతో శ్రమించండి. మీ కృషి ఫలిస్తుంది. పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర వుతాయి. ధనం సకాలంలో అందదు. ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొత్తవారితో మితంగా సంభాషించండి. సర్దుకు పోయే ధోరణితో మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
కార్యసాధనకు మరింత కష్టపడాలి. అవకాశం చేజారినా నిరుత్సాహ పడవద్దు. సన్నిహితుల హితవు మీపై పని చేస్తుంది. మొండిధైర్యంతో ముందుకు సాగు తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పనులు, బాధ్యతలు అప్పగిం చవద్దు. పిల్లల కదలికలను గమనిస్తూండాలి. ఆశించిన సంబంధం కుదరదు. ఇదీ ఒకం దుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఇంటి విషయాలపై శ్రద్థ వహిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్థి చేకూరుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవం తమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. చేపట్టిన పనులపై దృష్టి సారించండి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. ఉత్సా హంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. కలుపుగోలుగా మెలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడా వుడిగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. ఆర్థికంగా నిలదొక్కు కుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. మొండిగా ముందుకు దూసుకెళతారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. చిన్న విషయానికే చికాకు పడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. మీ వైఖరిని కొందరు తప్పుపడతారు. పనుల్లో శ్రమ అధికం. ఆశావహదృక్పథంతో యత్నాలు కొనసాగించండి. అపోహలకు తావివ్వవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్క బడతాయి. ముఖ్యమైన పత్రాలు అందు తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిల కడగా ఉండవు. సాయం అర్థించేందుకు మన స్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుం టారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి అలక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమ వుతుంది. ప్రశంసలు అందుకుంటారు. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్త వుతాయి. ఎదుటివారికి మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు స్వీకరణ, చెల్ల్లింపుల్లో జాగ్రత్త. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. గృహమార్పు అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం ఉంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రలోభా లకు లోనుకావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. ప్రయాణం కలిసివస్తుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ జోక్యం అనివార్యం. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకున్న కార్యం సాధిస్తారు. ఎదుటివారికి మీ నిజాయితీపై నమ్మకం కలు గుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం పడి గాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పువస్తుంది. యత్నాలు సాగిస్తారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 14 , 2025 | 10:46 AM