Horoscopes: ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు...
ABN, Publish Date - Nov 09 , 2025 | 07:35 AM
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. వేడుకను ఆర్భాటంగా చేస్తారుని, పరిస్థితులు చక్కబడతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుందని, ఖర్చులు విపరీతంగా ఉంటాయని, చేస్తున్న పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
అనుగ్రహం
9 - 15 నవంబర్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
మీఓర్పునకు పరీక్షాసమయం. దృఢసంకల్పంతో శ్రమించాలి. మీ సామర్థ్యం పై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి భంగపడతారు. అనుకోని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చేస్తున్న పనులను మధ్యలో నిలిపివేయవద్దు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కష్టం వృథా కాదు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. సన్నిహితులతో తరచూ కాలక్షేపం చేస్తుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అందరితోనూ మితంగా మాట్లాడండి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. సమస్యను సమర్థంగా పరిష్కరిస్తారు. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. తాకట్టు విడిపించుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నోటీసులు అందుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు విపరీతం. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. లౌక్యంగా మెలగండి. మీ మాటతీరు కొందరికి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
లావాదేవీలతో తీరిక ఉండదు. శారీరకశ్రమ, అకాలభోజనం, ఆలోచనలతో సతమతమవుతారు. కష్టించినా ఫలితం ఉండదు. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఏ విషయానికీ తీవ్రంగా స్పందించవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. చేసిన పనులు మొదటికే వస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ సమర్థతపైౖ నమ్మకం కలుగుతుంది. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఖర్చులు భారమనిపించవు. రశీదులు, కీలకపత్రాలు జాగ్రత్త. మీ అలక్ష్యానికి ఇతరులను తప్పుపట్టవద్దు. ఆహ్వానం అందుకుంటారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. చేస్తున్న పనులు ముందుకు సాగవు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
సంకల్పసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉం డదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు.అవసరాలు వాయిదా వేసుకుంటారు.దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆటంకాలెదురైనా పనులు పూర్తవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. శుభకార్యానికి హాజరవుతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. అనవసర వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి.
Updated Date - Nov 09 , 2025 | 07:35 AM