Vinayaka Chavithi 2025: ఈ సమయాల్లో గణపతిని ప్రతిష్టిస్తే శుభ ఫలితాలు
ABN, Publish Date - Aug 25 , 2025 | 07:31 PM
ఈనెల 27న వినాయక చవితి. అయితే, గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి శుభ సమయం ఎప్పుడు?, ఆ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: గణేష్ చతుర్థి పండుగను ఈసారి ఆగస్టు 27న జరుపుకుంటారు. ఈ రోజున చాలా ఇళ్లు, దేవాలయాల్లో గణపతిని ప్రతిష్టిస్తారు. కానీ విగ్రహాన్ని ఏ రోజు కొనాలి, ఎప్పుడు ఇంటికి తీసుకురావాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కాబట్టి, గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి శుభ సమయం ఎప్పుడు? ఆ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి శుభ సమయం
గణేష్ చతుర్థి రోజున (ఆగస్టు 27) ఉదయం 11 గంటల తర్వాత ఇంటికి తీసుకురావడం మంచిది. దానికంటే ముందే తీసుకురావాలనుకుంటే, ఈ శుభ సమయాల్లో గణేష్ విగ్రహాన్ని కొనవచ్చు.
ఉదయం వేళ 7:33 గంటల నుంచి 9:09 వరకు
ఉదయం 10:46 గంటల నుంచి మధ్యాహ్నం 12:22 వరకు
ఆగస్టు 26 విగ్రహాన్ని తీసుకురావాలనుకుంటే:
ఉదయం 9:09 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు.
విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ముహూర్తం ఆగస్టు 27 ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు అత్యంత శుభప్రదమైన సమయం.
గణేశుడు మధ్యాహ్నం జన్మించాడని ఎక్కువగా నమ్ముతారు. అందుకే మధ్యాహ్నం పూజకు ఉత్తమ సమయంగా పరిగణిస్తారు.
విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సరైన దిశ
ఈశాన్య దిశ (North-East corner) – ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. అక్కడ ప్రతిష్టిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.
జాగ్రత్తలు
మట్టితో చేసిన విగ్రహాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.
గణపతి తొండం ఎడమవైపు ఉండే విగ్రహం తీసుకోండి.
కూర్చున్న గణపతిని ప్రతిష్టించడం శుభప్రదం.
తెలుపు లేదా పసుపు రంగు గణపతి సిరిసంపద, శాంతి ఇస్తారని చెబుతారు.
విగ్రహం పాడవకుండా జాగ్రత్తగా చూసుకోండి.
(Note: ఈ సమాచారం నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పండితుల లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)
Also Read:
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Updated Date - Aug 25 , 2025 | 10:01 PM