Khairatabad Mahaganpati Aagaman: ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:16 PM
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్ నిలిచింది. ఇంతకాలం ఎంతో అపురూపంగా తయారైన ఖైరతాబాద్ గణేశుడు ఇవాళ భక్తులకు దర్శనమిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 25: ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్ నిలిచింది. ఇంతకాలం ఎంతో అపురూపంగా తయారైన ఖైరతాబాద్ గణేశుడు సోమవారం భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వాహకులు జరిపించారు.
గణపతికి ఒక వైపు పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు సహ లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి కొలువుతీరగా, మరోవైపు ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జల అమ్మవారు ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు సందర్శకులు పెద్దఎత్తున వస్తున్నారు. ఇప్పుడు ఆగమన్ జరగడంతో ఇక భక్తల తాకిడి తీవ్రమైంది.
దాదాపు తొమ్మిది రోజులపాటు ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర తొమ్మిది రకాల హోమాలు చేస్తారు. అదే విధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. దాంతోపాటు వినాయకుడికి కళ్యాణం ఉంటుంది. వినాయక చవితి రోజున వినాయకుడికి కళ్యాణం ఉంటుంది.
వినాయక చవితి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఇటు గవర్నర్ కూడా హాజరవుతారు. ఈ ఏడాది గణేశుడికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కళాకారులు 20 మంది రంగులద్దగా, తమిళనాడుకు చెందిన కళాకారులు విగ్రహాన్ని రూపొందించారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు... బలగాలు అప్రమత్తం
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News