PMO Meet On Trumph Tarrifs: ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:28 PM
భారత్‌పై ప్రస్తుతం 25 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా, బుధవారం నుంచి అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగులు చేస్తోందనే కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌లు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల వల్ల భారత్ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడనుందో చర్చిచేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో మంగళవారం నాడు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు.
భారత్‌పై ప్రస్తుతం 25 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా, బుధవారం నుంచి అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే భారత్ ఎగుమతులపై టారిఫ్‌ల ప్రభావం ఏ మేరకు ఉండనుందనే దానిపై ఎగుమతిదారులు, ఎగుమతుల ప్రోత్సహక మండళ్లతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.
టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండే కొన్ని రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఎమెర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్)ను అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాగా, కొలేటరల్ సపోర్ట్‌తో కూడిన సెక్టార్-స్పెసిఫిక్ క్రెడిట్ లైన్స్ వల్ల మైక్రో సంస్థలకు ఉపయుక్తంగా ఉంటుందని ఒక అధికారి పేర్కొన్నారు. లిక్విడిటీ ఒత్తిళ్లను సరళతరం చేసేందుకు క్లస్టర్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్స్ విషయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. ఎగుమతి ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎస్ఎంఈ) ప్రభుత్వ వ్యూహరచనలో ఇప్పటికీ కీలకంగానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రధాని విద్యా రికార్డును బహిర్గతం చేయరు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
ఈడీ దాడుల్లో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అరెస్టు
For More National News