Elvish Yadav: ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్ల అరెస్టు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:11 PM
గౌరవ్‌సింగ్ ఫరిదాపూర్‌లో స్కూల్ డ్రాపౌట్ కాగా, ఆదిత్య తివారీ బీహార్‌లోని తైమూర్ జిల్లాకు చెది బీసీఏ స్టూడెంట్ అని పోలీసులు తెలిపారు. గౌరవ్‌కు గత ఏడాది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రమేయం ఉండగా, ఆదిత్యకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు.
న్యూఢిల్లీ: యూట్యూబర్, బిగ్‌బాస్ మాజీ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కాల్పుల కలకలం సృష్టించిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి హిమాన్షు భావు-నీరజ్ ఫరీద్‌పురియా గ్యాంగులతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. నిందితులను గౌరవ్ సింగ్ అలియాస్ నిక్కా (22), ఆదిత్య తివారీ (19)గా గుర్తించారు.
గౌరవ్‌సింగ్ ఫరిదాపూర్‌లో స్కూల్ డ్రాపౌట్ కాగా, ఆదిత్య తివారీ బీహార్‌లోని తైమూర్ జిల్లాకు చెది బీసీఏ స్టూడెంట్ అని పోలీసులు తెలిపారు. గౌరవ్‌కు గత ఏడాది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రమేయం ఉండగా, ఆదిత్యకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు.
రోహిణిలోని సాహ్‌బాద్ డెయిరీ ఏరియాలో ఆదివారంనాడు గాలింపు చర్చలు జరుపుతుండగా నిందితులిద్దరూ పట్టుబట్టారు. పోలీసు టీమ్‌ను చూసి నిందితుల్లో ఒకరు పిస్తోల్ తీసేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకున్నారని ప్రత్యేక సెల్ డీసీపీ అమిత్ కౌషిక్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ఒక పిస్తోలు, ఐదు తూటాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కాగా, తొలుత ఇండో-నేపాల్ సరిహద్దు వైపు పారిపోయేందుకు ప్రయత్నించామని, అయితే గ్యాంగు లీడర్ల ఆదేశాలతో ఢిల్లీలో మరో అసైన్‌మెంట్ కోసం తిరిగి వచ్చామని పోలీసు ఇంటరాగేషన్‌లో నిందితులు చెప్పినట్టు అధికారులు తెలిపారు.
గురుగ్రామ్ ఘటన
ఈనెల 17న మోటార్ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు గురుగ్రామ్ సెక్టార్ 56లోని ఎల్వేష్ నివాసం వద్దకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ సమయంలో ఎల్విష్ ఇంట్లో లేరు. ఈ దాడికి తామే బాధ్యులమని భావూ గ్యాంగ్ సోషల్ మీడియోలో ప్రకటించుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈడీ దాడుల్లో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అరెస్టు
ఢిల్లీ సీఎం హత్యకు ప్లాన్.. చివరి క్షణంలో అలా.. విచారణలో షాకింగ్ నిజాలు..
For More National News