School Recruitment Scam: ఈడీ దాడుల్లో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అరెస్టు
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:36 PM
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్‌ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ (school recruitment sacm)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా (Jiban Krishna Saha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు అరెస్టు చేసింది. ఈడీ దాడుల సమయంలో ముర్షీదాబాద్‌లోని తన నివాసంలో జిబాన్ సాహా ఉన్నారు. ఈడీ ప్రశ్నిస్తుండగా ఆయన గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆయనను పట్టుకుంది. ఐదుగురు ఈడీ అధికారులు ఆయనపై వరుస ప్రశ్నలు గుప్పించారు. ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
డ్రైనేజీ నుంచి మొబైల్ స్వాధీనం
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్‌ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది. కోల్‌కతా సహా పలు జిల్లాలో ఉదయం నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ముర్షీదాబాద్, బీర్భూమ్ జిల్లాలకు టీమ్‌లను పంపింది. జిబాన్ సన్నిహితుల ఇళ్లపై కూడా దాడులు జరిపింది. సాహా, ఆయన సన్నిహితుల వద్ద కీలకమైన సాక్ష్యాలు, లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది.
ఇంతకుముందు కూడా అరెస్టయిన సాహా
టీచర్ రిక్రూట్‌మెంట్ అవినీతి కేసులు బుర్హాన్ ఎమ్మెల్యే సాహా గతంలో అరెస్టయ్యారు. 2023 ఏప్రిల్ 17న ఆయన అరెస్టు కాగా, 2024లో బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన బెయిలుపై బయట ఉన్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో సీబీఐ కూడా ఆయనను గతంలో అరెస్టు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి బెయిలు పొందారు. ఈసారి ఈడీ ఆయనను అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి..
Supreme Court: సోషల్ మీడియా ట్రోలింగ్‌కు చెక్ పెట్టండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం..
ఢిల్లీ సీఎం హత్యకు ప్లాన్.. చివరి క్షణంలో అలా.. విచారణలో షాకింగ్ నిజాలు..
For More National News